ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని డిలిట్ చెయ్యడం ఇంత సులువా..?

Posted By: Prashanth

ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని డిలిట్ చెయ్యడం ఇంత సులువా..?

 

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో సుమారు 800 మంది మిలియన్ యూజర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో కొత్తగా రూపొందించిన టైమ్‌లైన్ ఫీచర్ ఇప్పుడు ప్రొపైల్స్‌కి తప్పనిసరి. మీరు గనుక దీనిని లైక్ చేయని పక్షంలో మీ పర్సనల్, ప్రయివేట్ పోస్టులతో పాటు స్టేటస్ అప్ డేట్స్, వీడియోలు, ఫోటోలు అన్ని కూడా మీ స్నేహితులకు బహిర్గతం చేస్తుంది.

ఏది ఏమైనప్పటికీ.. చాలా మంది వినియోగదారులు అనవసరంగా లెక్కకు మించి ఫేస్‌బుక్‌ ఎకౌంట్లను క్రియేట్ చేస్తుంటారు. లెక్కకు మించి క్రియేట్ చేసిన ఫేస్‌బుక్‌ ఎకౌంట్స్‌ని డిలిట్ చేయడం ఎలాగో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం తెలుగు ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని ఎలా డిలిట్ చెయ్యాలో తెలుగు గిజ్‌బాట్.కామ్ వీడియో రూపంలో అందిస్తుంది.

క్రిందనున్న వీడియో ద్వారా ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని డిలిట్ చెయ్యడం ఎలాగో ఈజీగా తెలుసుకోవచ్చు.

మొదటగా మీరు చెయ్యాల్సింది మీ ఫేస్‌బుక్ ఎకౌంట్‌లోకి లాగిన్ అవ్వడం. ఆ తర్వాత పేజి క్రింద భాగంలో ఉన్న హెల్ప్ అనే ఆఫ్షన్ పై క్లిక్ చేయండి. హెల్ప్ సెంటర్ ద్వారా సెర్చ్ బాక్సులో ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని శాశ్వతంగా డిలిట్ చెయ్యడం ఎలాగా అనే లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ ఫేస్‌బుక్ ఎకౌంట్ పాస్ వర్డ్‌ని టైపు చేసి ఓకె మీద క్లిక్ చెయ్యండి. దీంతో మీ ఫేస్‌బుక్ ఎకౌంట్ 14 రోజుల తర్వాత శాశ్వతంగా డిలిట్ అవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot