Home
News

Google టార్గెటెడ్ యాడ్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఎలా ఆఫ్‌ చేయాలి?

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సెర్చ్‌ (Google) ఇంజన్‌ వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం వివిధ రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆయా ఫీచర్ల ద్వారా సౌకర్యవంతమైన, సురక్షితమైన బ్రౌజింగ్‌ అందించేలా చర్యలు తీసుకుంటోంది. అయితే కొన్ని ఫీచర్లపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు.

అయితే తాజాగా గూగుల్‌.. క్రోమ్‌ బ్రౌజర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన టార్గెటెడ్ యాడ్‌ ట్రాకింగ్ సిస్టమ్‌పై (Google targeted ad tracking system) పలువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల భద్రతకు ముప్పు కలుగుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫీచర్‌ వినియోగదారుని బ్రౌజింగ్‌ హిస్టరీ ఆధారంగా పనిచేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను డిసేబుల్‌ చేసేందుకు కావాల్సిన వివరాలు మీకోసం.

google targeted ad tracking system

తొలుత క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి. అనంతరం సెట్టింగ్‌లోకి వెళ్లాలి. అందుబాలోని సబ్‌మెనూ పైన ట్యాప్‌ చేయాలి. అనంతరం ప్రైవసీ మరియు సెక్యూరిటీపైన క్లిక్‌ చేయాలి. అనంతరం ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ పైన క్లిక్‌ చేయాలి.

తర్వాత యాడ్‌ ప్రైవసీని ఎంచుకోవాలి. అక్కడ కనిపించిన టార్గెటెడ్‌ యాడ్‌ ట్రాకింగ్‌ను ఎంచుకోవాలి. ఇందులో మూడు కేటగిరిలు కనిపిస్తాయి. అవి యాడ్‌ టాపిక్‌ ( బ్రౌజింగ్‌ హిస్టరీ ఆధారంగా), సైట్ సఫార్సు చేసిన యాడ్స్‌ (సందర్శించిన సైట్స్‌ ఆధారంగా), యాడ్‌ మెజర్‌మెంట్‌ వంటివి కనిపిస్తాయి. వాటిలో ప్రతి కేటగిరిపైన క్లిక్‌ చేసి ఆఫ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టార్గెటెడ్‌ యాడ్‌ ట్రాకింగ్‌ను ఆఫ్‌ చేయవచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవచ్చు.

*గూగుల్‌ పుట్టినరోజు : చాలా మంది జీవితాల్లో భాగమైన సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది. 1998 సెప్టెంబర్‌ 4న గూగుల్‌ ప్రారంభం అయింది. అయితే తొలి 7 సంవత్సరాలు సెప్టెంబర్ 4నే వార్షికోత్సవం నిర్వహించింది. కానీ రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్ 27కి మార్చింది. ఇవాళ గూగుల్‌ 25వ పుట్టినరోజు నిర్వహించుకుంటోంది. ఇందుకు గుర్తుగా ప్రత్యేక డూడుల్‌ను డిస్‌ప్లే (G25gle) చేస్తోంది.

ప్రస్తుతం గూగుల్‌కు భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 6 ఖండాల్లో 200 నగరాల్లో గూగుల్‌ కార్యాలయాలు, డేటా కేంద్రాలను కలిగి ఉంది. గూగుల్‌లో ప్రతిరోజు 150 కంటే ఎక్కువ భాషల్లో బిలియన్ల కొద్దీ పరిశోధనలు జరుగుతున్నాయి. గూగుల్‌ పేరు తొలిదశలో గూగోల్‌ (Googol) నుంచి వచ్చింది. Googol అంటే 1 తర్వాత 100 జీరోలు అని అర్థం.

క్రోమ్ డెస్క్‌టాప్ / వెబ్‌వెర్షన్‌ యూజర్ల కోసం డార్క్‌ మోడ్‌ను సైతం తీసుకొచ్చింది. థీమ్‌ను డార్క్ మోడ్‌లో పెట్టుకుంటే క్రోమ్‌ డెస్క్‌టాప్‌ కూడా ఆటోమేటిక్‌గా డార్క్‌ మోడ్‌కు మారుతుంది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ తొలిసారిగా 2019 సంవత్సరంలో నైట్‌ మోడ్‌/ డార్క్‌ మోడ్‌ సౌకర్యాన్ని అందుబాటోలోకి తీసుకొచ్చింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
how to disable google targeted ad tracking system
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X