రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా ?

By Gizbot Bureau
|

మనం ఇంటర్నెట్లో అనేక రకాలైన ఫోటోలను చూస్తుంటాం. అయితే అది నిజమా కాదా అనేది మాత్రం ఎలా తెలుసుకోవాలో తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఇమేజ్ ని గ్రాఫిక్స్ సాయంతో మార్చివేసి వేరే విధంగా చూపిస్తారు. ఇది ఎక్కువగా రాజకీయ నాయకుల మీద జరుగుతుంది.

 
How to Do a Reverse Image Search From Your Phone

మీకు అలాంటి ఎప్పుడైనా కనిపించిందా.. ఆ ఫొటో నిజమైనదేనా అనే అనుమానం కలిగిందా.. ఆ ఫొటో సోషల్ మీడియాలోంచి తీసుకున్నదా లేదా డేటింగ్ సైట్లలోదా లేదా ఏదైనా న్యూస్ స్టోరీదా అనే డౌట్ వచ్చిందా.. మనం చూస్తున్న ఫొటో నిజమైందా కదా అని తెలుసుకోవాలని ఉందా? అయితే దీన్ని తెలుసకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఓట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు.

 గూగుల్ ఇమేజస్

గూగుల్ ఇమేజస్

ఆన్ లైన్లో ఇమేజ్ లను సెర్చ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించే వనరు గూగుల్ ఇమేజెస్. గూగుల్ ఇమేజస్ మనకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్ వెతికినప్పుడు ఆ ఇమేజ్ ఇంతకుముందు చూసినట్లు అనిపించిందా? అలాంటప్పుడు గూగుల్ ఇమేజెస్ కి వెళ్లి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయాలి. మీరు చూసిన ఫొటో యూఆర్ఎల్ ని అక్కడ పేస్ట్ చేయాలి. లేకపోతే ఆ ఫొటోను నేరుగా అప్లోడ్ చేయాలి. వెంటనే గూగుల్ ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చిందో మూలం ఎక్కడిదో మనకు చెప్పేస్తుంది.

TinEye

TinEye

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడానికి టిన్ ఐ టూల్ బాగా యూజ్ అవుతుంది. మీకు అనుమానం కలిగిన ఫొటోలను టిన్ ఐకి ఇస్తే చాలు ఇదే స్కాన్ చేసుకుని ఈ ఫొటోకు సంబంధించి అలెర్టులను ఎప్పటికప్పుడు మీకు అందజేస్తుంది. అయితే గూగుల్ సెర్చ్ కి ఉన్నంత ఆక్యురెసీ దీనికి లేదు. జనరల్ ఇమేజెస్ మీదే ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఫొటోగ్రఫీ, డిజైన్స్ లాంటి ఇమేజ్ లను ఇది వెతికి పెడుతుంది. మీ ఇమేజ్ లను ఎవరూ కాపీ కొట్టకూడదని భావిస్తే టిన్ ఐ ద్వారా వెతికి పట్టుకోవడం మంచి ఆప్షన్.

Bing
 

Bing

మీరు www.bing.com/imagesలోకి వెళ్లి కూడా ఇమేజ్ సెర్చ్ చేయవచ్చు. మీ డెస్క్ టాప్ నుంచి ఈ యుఆర్ ఎల్ ఓపెన్ చేసిన తరువాత మీకు అక్కడ కెమెరా బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే కింద మూడు రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. iCloud Drive, Google Drive, and Dropbox నుంచి సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఆ ఇమేజ్ అప్ లోడ్ చేస్తే అది ఇంతకుముందు ఎక్కడైనా వాడారా లేదా అన్నది వెంటనే తెలిసిపోతుంది.

Yandex

Yandex

ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మీరు ఇమేజ్ అప్ లోడ్ చేయగానే దాని రిలేటెడ్ ఇమేజ్స్ మొత్తం లిస్టును చూపిస్తుంది. అయితే ఇది అమౌంట్ అడుగుతుంది. ఇది ఆఫ్ లైన్ లోనూ ఆన్ లైన్ లోనే ఆటోమేటిగ్గా ఇమేజ్ ని ట్రాక్ చేస్తుంది. దీంతో పాటుగా Veracity, Search By Image, Reversee, Reverse Image Search Extension వంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
How to Do a Reverse Image Search From Your Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X