Coronavirus: PM CARES సహాయ నిధికి మీ వంతు సహాయం చేయడం ఎలా?
కరోనావైరస్ కేసుల సంఖ్య భారతదేశంలో క్రమంగా పెరుగుతున్న కారణంగా భారత ప్రభుత్వం దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ను ప్రకటించింది. ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారతదేశంలో ఇటువంటి విషయాలు చాలా తేలికగా బయటపడతాయి. భారతదేశంలో ఈ మహమ్మారి మూడవ దశకు ఆరంభం కాకుండా ఉండడానికి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు తమ వంతు సహాయంగా విరాళాలను అందించడానికి సిద్ధమవుతున్నాయి.

PM CARES
భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలతో పాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రధాని సిటిజెన్ అస్యూరెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (PM CARES) చొరవను ప్రారంభించారు. ఇక్కడ మీరు PM CARES నిధికి సులభంగా విరాళం ఇవ్వవచ్చు మరియు దేశాన్ని రక్షించడంలో మీ వంతు కృషి చేయవచ్చు. మీరు సహాయం చేయడానికి క్రెడిట్ / డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ మరియు పేటిఎం మరియు గూగుల్ పే వంటి అనేక ఇ వాలెట్లను ఉపయోగించవచ్చని గమనించండి. క్రింద ఇవ్వబడిన అన్ని రకాల వివరాలలో pmindia.gov.in కు తమ వంతు విరాళాలను అందివ్వవచ్చు.

ఆన్‌లైన్ పద్ధతి
PM CARES ఫండ్‌కు విరాళం ఇవ్వడానికి మొదటి పద్ధతి pmindia.gov.in కు లాగిన్ అవ్వడం. ఇక్కడ "విరాళం వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి" అనే బటన్ కోసం చూడండి. తరువాత "ఆన్‌లైన్ విరాళం బటన్ మీద క్లిక్ చేయండి" దీని మీద క్లిక్ చేయడం ద్వారా ముందుకు కొనసాగవచ్చు. తరువాత క్రొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ యొక్క అన్ని వ్యక్తిగత వివరాలను నమోదు చేయవచ్చు మరియు మీకు నచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వవచ్చు.

ఆఫ్‌లైన్ పద్ధతి
మీరు PM CARES ఫండ్‌కు ఆఫ్‌లైన్‌లో కూడా విరాళం ఇవ్వవచ్చు. ఇందులో బదిలీ చేయడానికి మీరు ఈ క్రింది వివరాలను ఉపయోగించవచ్చు.
అకౌంట్ పేరు: PM CARES
అకౌంట్ నెంబర్ : 2121PM20202
IFSC కోడ్: SBIN0000691
UPI: pmcares @ sbi

E-వాలెట్ పద్ధతి
మీరు ఇ వాలెట్ ఉపయోగిస్తుంటే PM CARES ఫండ్‌కు డబ్బును విరాళం చేయడానికి సులభమైన మార్గం క్రింది ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం. మీ Paytm, Gpay లేదా ఇతర యాప్ ద్వారా స్కానర్‌ను ఉపయోగించి ఈ QR ను స్కాన్ చేసి మీకు తోచిన మొత్తాన్ని బదిలీ చేయవచ్చు. కింద అందించిన QR నేరుగా pmindia.gov.in కు మీ యొక్క విరాళం వివరాలను చేరవేస్తుంది.

కొరోనావైరస్కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో భారతీయులు ముందుకు వెళ్లి డబ్బును విరాళంగా ఇవ్వగల అకౌంట్ నెంబర్ ఇది. వ్యాధితో పోరాడుతున్న వైద్యులు, నర్సులు మరియు ఇతర ప్లాట్‌ఫామ్‌లకు సహాయపడటానికి పరికరాలు మరియు ఇతర వైద్య వినియోగ కేసుల కొరకు ఈ సహాయ మొత్తాన్ని ప్రభుత్వం వినియోగించనున్నది.


Click it and Unblock the Notifications








