‘మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 11′ డౌన్‌లోడ్ ఏలా?

Posted By: Prashanth

‘మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 11′ డౌన్‌లోడ్ ఏలా?

 

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అధికారకంగా మార్కెట్లోకి ఫైర్‌ఫాక్స్ 11.0 వర్సన్‌ని విడుదల చేసింది. మొజిల్లా విడుదల చేసిన ఈ సరిక్రొత్త బ్రౌజర్ యూజర్ ప్రెండ్లీ అవడమే కాకుండా కొత్త ఫీచర్స్‌ని సపోర్ట్ చేయనుంది. మొజిల్లా కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వర్సన్‌లో వెబ్ అప్లికేషన్ ఇంటిగ్రెడెట్‌ డెస్క్ టాప్‌ని నిక్షిప్తం చేశారు. దీని సహాయంతో యూజర్స్ ఓ సరిక్రొత్త ఇంటర్నెట్ అనుభవాన్ని పొందనున్నారు. ఒకే ఒక్క సింగిల్ క్లిక్‌ ద్వారా ఈ అప్లికేషన్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు.

పైర్‌ఫాక్స్ 11.0 వర్సన్‌లో నిక్షిప్తం చేసిన ‘వెబ్ అప్లికేషన్ ఇంటిగ్రెడెట్‌ డెస్క్‌టాప్‌’ ద్వారా తాజా సమాచారం ఇంటర్నెట్లో ఏమి జరుగుతుందో ఈజీగా తెలుసుకోవచ్చని మొజిల్లా ప్రతినిధులు తెలిపారు. లోకేషన్ ఆధారిత సెర్చ్ రిజల్ట్స్ కొత్త రకంగా అభివృద్ది చేశారు. మీరు సెర్చ్‌లో టైపు చేసిన క్వచ్చన్స్‌కి సమాధానాలను ఈజీగా రాబట్టోచ్చు. దీనితో పాటు ఇందులో HTML 5 మీడియా కంట్రోల్స్‌ని పొందుపరిచారు.

యూజర్స్‌కు ఓ సరిక్రొత్త విజువల్ ఎఫెక్ట్స్‌ని ఫైర్‌ఫాక్స్ 11.0 అందివ్వనుంది. ఫీచర్స్ విషయంలో ఫైర్ ఫాక్స్ 11.0ని ది బెస్ట్‌గా అభివర్ణిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 11.0కి సంబంధించిన డౌన్‌లోడ్‌ని వెంటనే www.softpedia.com నుండి డౌన్‌లోడ్ చేసుకోని ఎంజాయ్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot