ఆపిల్ iOS 26 ను ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.. సపోర్టింగ్ ఐఫోన్‌ల లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా ?
ఆపిల్ ఇటీవల Awe Dropping ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా ఐఫోన్ 17 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 విడుదల అయింది. iOS 26 అప్‌డేట్ సెప్టెంబర్ 15 వ తేదీ అన్ని సపోర్టింగ్ డివైజ్‌లకు అందుబాటులోకి వచ్చింది. ఈ OS వెర్షన్‌లో అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. వినియోగదారుని అనుభవాన్ని మెరుగుపరుస్తుందని చెబుతోంది.
iOS 26 ను ఎలా డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకోవాలి?
> ముందుగా ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
> అక్కడ జనరల్ పైన ట్యాప్ చేసి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పైన క్లిక్ చేయాలి
> అక్కడ మీకు అందుబాటులో ఉన్న అప్‌డేట్స్ వివరాలు కనిపిస్తాయి
> మీ డివైజ్‌కు iOS 26 అందుబాటులో ఉంటే, డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు
> అయితే ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, డివైజ్‌ను రీబూట్ చేయాల్సి ఉంటుంది.

iOS 26 ఏయే డివైజ్‌లను సపోర్టు చేస్తుంది
> ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్
> ఐఫోన్ 12, ఐఫోన్ 12 మిని, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్
> ఐఫోన్ 13, ఐఫోన్ 13 మిని, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్
> ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
> ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
> ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఐఫోన్ 16e
> ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్
> ఐఫోన్ SE (2 వ జనరేషన్), ఐఫోన్ SE (3వ జనరేషన్)
ఆపిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్ తోపాటు ఆపిల్ A12 బయోనిక్ చిప్ పైన పనిచేసే డివైజ్‌లకు ఆపిల్ తన సపోర్టును నిలిపేసింది. iOS 26 వెర్షన్‌ను పొందాలంటే కనీసం A13 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది.
ఆపిల్ iOS 26 లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ ను కూడా తీసుకొచ్చింది. నచ్చినట్లుగా ఎమోజీలు, జన్‌మోజీలను మార్చుకోవచ్చు. మ్యూజిక్ సమయంలో ప్రత్యేక యానిమేషన్ ఎఫెక్ట్‌ను పొందవచ్చు. దీంతోపాటు లైవ్ ట్రాన్స్‌లేషన్, ఏఐ పవర్ షార్ట్‌కట్స్, రైటింగ్ టూల్స్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
సెంట్రలైజ్డ్ పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. పాస్‌కీస్‌తోపాటు వైఫై లాగిన్స్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. రెండు ఐఫోన్‌లను సమీపానికి తీసుకొచ్చి, ల్యాప్ టూ క్యాష్ ఫీచర్ ద్వారా సులభంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. మెయిల్ యాప్ ఆటోమేటిక్‌గా వచ్చిన మెయిల్స్‌ను కేటగిరీల వారీగా విభజన చేస్తుంది. గేమింగ్ సమయంలో మెరుగైన పనితీరును అందించే విధంగా సర్దుబాట్లు చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications