Home
News

Josh App స్పెషల్ ఫీచర్స్!!! డౌన్‌లోడ్ మరియు ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

ప్రపంచం మొత్తం తమను తాము పాపులర్ చేసుకోవడానికి ఉపయోగించే ఏకైక సూత్రం చిన్న చిన్న వీడియోలను తయారుచేయడం. చిన్న వీడియోల తయారీ ప్లాట్‌ఫారమ్‌లలో అధికంగా ఉపయోగించే యాప్ లలో ఒకటి జోష్ యాప్. ప్రస్తుతం ఇండియాలో టిక్‌టాక్‌ను నిషేధించినందున దానికి ప్రత్యామ్నాయంగా విడుదలైన ఈ యాప్ బాగా పాపులర్ అయింది. ఇటీవలి కాలంలో స్వదేశీ ఫీచర్లతో ఉద్భవిస్తున్న ప్రసిద్ధ చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో జోష్ యాప్ ఇతర యాప్ లతో పోలిస్తే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జోష్ యాప్ ఉపయోగం

జోష్ యాప్ ఉపయోగం

టిక్‌టాక్‌ మాదిరిగా చిన్న వీడియోలను సృష్టించడానికి మరియు వాటిని మరొకరికి షేర్ చేయడానికి వినియోగదారులకు వేదికను అందించే తాజా చేర్పులలో జోష్ యాప్ ఒకటి. మేడ్-ఇన్-ఇండియా ఫీచర్ తో వస్తున్న ఈ యాప్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ మరియు మలయాళం వంటి వివిధ ప్రాంతీయ భాషల మద్దతుతో వస్తుంది. ఇందులో ట్రెండింగ్, ఫన్నీ, గ్లామరస్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, బాలీవుడ్, టాలీవుడ్ వంటి మరిన్ని వివిధ శైలులు మరియు భాషల నుండి వినోదాత్మక వీడియోలను వినియోగదారులు చూడవచ్చు. జోష్ యాప్ లో గుర్తించిన గొప్ప ప్రత్యేకమైన అంశం ఏమిటంటే ఇది లాగిన్‌ను తప్పనిసరి చేయదు.

 

జోష్ యాప్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడం ఎలా

జోష్ యాప్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడం ఎలా

జోష్ యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ లింకును ఓపెన్ చేసి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. డౌన్‌లోడ్ అయిన తర్వాత "ఇన్‌స్టాల్" ఎంపిక మీద క్లిక్ చేయడంతో మీ స్మార్ట్‌ఫోన్‌లో నేరుగా ఇన్‌స్టాల్ అవుతుంది. తరువాత మీరు నేరుగా ఈ యాప్ ను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. దీని యొక్క పరిమాణం 7.6MB.

 

జోష్ యాప్ ను ఉపయోగించడం ఎలా?

జోష్ యాప్ ను ఉపయోగించడం ఎలా?

స్మార్ట్‌ఫోన్‌లో జొష్ యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన తరువాత యాప్ ను ఓపెన్ చేసిన వెంటనే భాష ఎంపికలను ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం జోష్ యాప్ హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు ఇంగ్లీష్ భాషలకు మాత్రమే మద్దతు ఇస్తుంది. మీరు భాషను ఎంచుకున్న తర్వాత యాప్ యొక్క హోమ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చిన్న చిన్న వీడియోలను చూడవచ్చు.

 

జోష్ యాప్ ఇంటర్‌ఫేస్

జోష్ యాప్ ఇంటర్‌ఫేస్

టిక్ టోక్ మాదిరిగానే జోష్ యాప్ అధిక యూజర్ ఇంటర్ఫేస్ ను అందిస్తుంది. టిక్‌టాక్ మాదిరిగానే వినియోగదారులు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వీడియోలను కూడా చూడవచ్చు. మరిన్ని వీడియోలను చూడటం కొనసాగించడానికి హోమ్ పేజీని పైకి స్క్రోల్ చేస్తూ ఉండాలి.

జోష్ యాప్‌లో వీడియోలను సృష్టించడం మరియు అప్‌లోడ్ చేయడం ఎలా?

జోష్ యాప్‌లో వీడియోలను సృష్టించడం మరియు అప్‌లోడ్ చేయడం ఎలా?

జోష్ యాప్‌లో వినియోగదారులు తమ యొక్క వీడియోలను సృష్టించడం ప్రారంభించడానికి కొన్ని ప్రాథమిక అనుమతులు అవసరం ఉంటుంది. ఈ కింది పద్దతులను పాటించి మీ యొక్క వీడియోలను సృష్టించవచ్చు.


స్టెప్ 1: వినియోగదారులు తమ వీడియోలను సృష్టించడానికి స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా మరియు గ్యాలరీని యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇవ్వాలి.

స్టెప్ 2: జోష్ యాప్‌లో మీ వీడియోను మరింత ఆసక్తికరంగా చేయడానికి సాధారణ ఎడిటింగ్ పద్ధతులను కూడా అదనంగా ఉపయోగించవచ్చు. ఇందులో మీరు సంగీతం, ఫిల్టర్లు వంటి మరెన్నో జోడించవచ్చు.

స్టెప్ 3: జోష్ యాప్‌లో మీరు లాగిన్ అవ్వాలి లేదా క్రొత్త అకౌంటును సృష్టించాలి. అకౌంటును సృష్టించిన వారికి యాప్ వినియోగదారుడి యొక్క పేరును అందిస్తుంది. ఇక్కడ వినియోగదారులు మీ వీడియోలను చూడగలరు.

స్టెప్ 4: పైన తెలిపిన పద్ధతులు పూర్తయిన తర్వాత మీరు నేరుగా మీ యొక్క వీడియోను అప్‌లోడ్ చేయవచ్చు. వీడియోను అప్‌లోడ్ చేసేటప్పుడు కొన్ని ఎంపికలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు మీ వీడియోను యాప్ లోని ప్రతి ఒక్కరితో పబ్లిక్‌గా షేర్ చేయవచ్చు లేదా మీ అనుచరులతో మాత్రమే షేర్ చేయవచ్చు.

 

జోష్ యాప్‌లో వీడియోలను ఎలా షేర్ చేయాలి?

జోష్ యాప్‌లో వీడియోలను ఎలా షేర్ చేయాలి?

జోష్ యాప్‌లో మీ వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు వీడియోను ఫేస్‌బుక్ మరియు వాట్సాప్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా అందరితో షేర్ చేసుకోవచ్చు. ట్రీ-బోటేడ్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు సృష్టించిన వీడియోలే కాకుండా ఇతర వినియోగదారులు సృష్టించిన వీడియోలను కూడా మరొకరితో షేర్ చేసుకోవచ్చు.

జోష్ యాప్‌లో రాబోయే కొత్త అప్ డేట్స్

జోష్ యాప్‌లో రాబోయే కొత్త అప్ డేట్స్

ప్రస్తుతం జోష్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజులలో ఐఫోన్ మరియు ఐప్యాడ్ వినియోగదారుల కోసం ఆపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెర్షన్ - 1.0.10 సున్నితమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్ కోసం బగ్ పరిష్కారాలను తీసుకువచ్చింది. మార్కెట్లో తాజా షార్ట్ వీడియో యాప్‌లలో జోష్ యాప్ రోపోసో, మోజ్, మిట్రాన్ వంటి ఇతర మేడ్-ఇన్-ఇండియా ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడటానికి సిద్ధంగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How To Download And Install Josh App; Unique Features To Check Out
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X