వాట్సాప్‌లో పదో తరగతి హాల్‌టికెట్లు.. ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి..!
SSC Hall tickets 2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలో పదో తరగతి పరీక్షలు (SSC) ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఏపీలో ఈ నెల 16 వ తేదీ నుంచి. తెలంగాణాలో 14 వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ హాల్‌టికెట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వెబ్‌సైట్‌లతోపాటు వాట్సాప్ ద్వారానూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీలో (AP SSC Hall Tickets 2026) మార్టి 16 నుంచి ఏప్రిల్ 1 వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ (www.bsc.ap.gov.in), మనమిత్ర వాట్సాప్ నంబర్ (9552300009), లీప్ యాప్ ద్వారా SSC హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెగ్యూలర్/ ప్రైవేటు/ ఓఎస్‌ఎస్‌సీ రెగ్యులర్/ ఒకేషనల్ కేటగిరీల వారీగా హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్ ద్వారా SSC హాల్‌టికెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
> వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
> అనంతరం అటువైపు నుంచి మీకు స్పందన వస్తుంది.
> అక్కడ సర్వీస్ సెలక్షన్ ఆప్షన్ వస్తుంది.
> హాల్‌టికెట్ల కోసం ఎడ్యుకేషన్ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి.
> అక్కడ అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. మీరు SSC హాల్‌టికెట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
> ఆప్లికేషన్ నంబర్‌తోపాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసుకోవాలి.
> అనంతరం మీ నంబర్‌కు హాల్‌టికెట్ వస్తుంది.
> డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
* తెలంగాణలో (Telangana SSC Hall Tickets) బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ bsc.telangana.gov.in ద్వారా, 80969558096 వాట్సాప్ నంబర్ ద్వారా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాఠశాలల లాగిన్‌లోనూ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మార్చి 14 వ తేదీ నుంచి ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
వాట్సాప్ నుంచి SSC హాల్‌టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
> 8096958096 వాట్సాప్ నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి.
> అటువైపు నుంచి వెల్‌కమ్ టు మీ సేవ అని రిప్లై వస్తుంది.
> అనంతరం SSC hall ticket march 2026 అని టైప్ చేయాలి.
> అప్పుడు మీ నంబర్‌కు లింక్ వస్తుంది.
> ఆ లింక్ పైన క్లిక్ చేసి జిల్లా, పాఠశాల పేర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
> అనంతరం విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
> చివరగా మీ ఫోన్‌కు వచ్చిన హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








