PUBGకి చుక్కలు చూపిస్తున్న Call of Duty,డౌన్లోడ్ ప్రాసెస్ మీకోసం

నేడు పిల్ల‌లు, యువ‌త ప‌బ్‌జి గేమ్‌కు ఎలా అడిక్ట్ అయిపోయారో అంద‌రికీ తెలిసిందే. ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఇత‌ర గేమ్స్‌లా కాదు. అందులో మునిగిపోయారంటే గంట‌ల త‌ర‌బ‌డి గేమ్ ఆడ‌వ‌చ్చు. ఇక గేమ్ ఫినిష్ చేయ‌క‌పోతే ఏ

|

నేడు పిల్ల‌లు, యువ‌త ప‌బ్‌జి గేమ్‌కు ఎలా అడిక్ట్ అయిపోయారో అంద‌రికీ తెలిసిందే. ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఇత‌ర గేమ్స్‌లా కాదు. అందులో మునిగిపోయారంటే గంట‌ల త‌ర‌బ‌డి గేమ్ ఆడ‌వ‌చ్చు. ఇక గేమ్ ఫినిష్ చేయ‌క‌పోతే ఏదో కోల్పోయామ‌న్న భావ‌న ప్లేయ‌ర్ల‌లో క‌లుగుతున్న‌ది. దీంతో గేమ్‌కు చాలా మంది అడిక్ట్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ గేమ్ కు Call of Duty రూపంలో షాక్ తగలనుంది.

PUBGకి చుక్కలు చూపిస్తున్న Call of Duty,డౌన్లోడ్ ప్రాసెస్ మీకోసం

యాక్టివిజన్ సంస్థ ఈ గేమ్ ని రూపొందించింది. కాగా ఈ గేమ్ ని గతేడది కంపెనీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ గేమ్ ని కంపెనీ బీటా వర్షన్ లో రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న గేమింగ్ ప్రియులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి బీటా వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రి రిజిస్టర్ చేసుకున్నవారికి

ప్రి రిజిస్టర్ చేసుకున్నవారికి

కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ బీటా టెస్టింగ్ ఇప్పుడు ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులోకి వచ్చింది. ప్రి రిజిస్టర్ చేసుకున్నవారికి దశల వారీగా గేమ్‌ లభ్యం కానుంది. గేమ్ ఆడాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. ఫోన్‌లో దాదాపు 2 జీబీ స్టోరేజ్ ఖాళీగా ఉండాలి. ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ కూడా అవసరమవుతుంది.

అదనంగా ఫైల్

అదనంగా ఫైల్

ఈ గేమ్ ఇంకా అధికారికంగా మీ డివైస్ లోకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఈ గేమ్ ఆడేవారు అదనంగా ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు దీన్ని అఫిషియల్ గా ఇన్ స్టాల్ చేసుకునే సౌకర్యం లేదు. మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం .

గేమ్‌ను డౌన్‌లోడ్ ఎలా ?
 

గేమ్‌ను డౌన్‌లోడ్ ఎలా ?

స్టెప్ 1
మీరు ముందుగా గూగుల్ సెర్చ్ బార్‌లో కెళ్లి కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏపీకే డౌన్‌లోడ్ అని టైప్ చేసి, ఎంటర్‌పై క్లిక్ చేయండి. ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ నుంచే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయ్నతించండి. లేదంటే మాల్వేర్, ఇతర ప్రమాదాలను మీ మొబైల్ ఎదుర్కొవలసి వస్తుంది.

స్టెప్ 2,
డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత యూజర్లు మళ్లీ అడిషనల్ డేటా ఫైల్ లేదా OBB ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇది ఉంటేనే గేమ్ రన్ అవుతుంది. కాగా ఈ ఫైల్ ఇంటర్నెట్‌లో సులభంగా లభ్యమవుతుంది.

స్టెప్ 3,
ఫోన్‌లోని ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోల్డర్‌లోకి వెళ్లండి. ఓబీబీ ఫోల్డర్ కనిపిస్తుంది. ‘com.activision.callofduty.shooter' పేరుతో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయండి. తర్వాత OBB file ఫైల్ ని ఆ ఫోల్డర్ లో కాపీ చేయండి. అయిపోయిన తర్వాత మీరు గేమ్ ని స్టార్ట్ చేయవచ్చు.

అనారోగ్య సమస్యలు

అనారోగ్య సమస్యలు

ఇదిలా ఉంటే గేమ్స్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప‌బ్‌జి మొబైల్ గేమ్ మాత్ర‌మే కాదు, ఇత‌ర ఏ గేమ్ అయినా స‌రే దాని ప‌ట్ల వ్య‌స‌నప‌రులుగా మారితే గేమింగ్ డిజార్డ‌ర్ వ్యాధి వ‌స్తుంద‌ని, అలాంటి స్థితికి చేరుకున్న వారు పై వ్యక్తిలాగే మారుతార‌ని సైకియాట్రిస్టులు అంటున్నారు. నిత్యం ఒక అర గంట లేదా గంట సేపు కంప్యూట‌ర్ లేదా మొబైల్ గేమ్స్ ఆడితే ఫ‌ర‌వాలేద‌ని, కానీ అది శృతి మించితే ఇలాంటి అన‌ర్థాలే సంభ‌విస్తాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

Best Mobiles in India

English summary
here is How to download Call of Duty Mobile on any smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X