Online ద్వారా ఓటరు ID ని డౌన్‌లోడ్ చేయడం,EPIC నంబర్‌ను తనిఖీ చేయడం ఎలా?

|

ఓటరు ఐడి కార్డు అనేది గుర్తింపు కార్డులలో ఒకటి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు ఐడిని పొందాలని చూస్తూ ఉంటారు. రాష్టంలో జరిగే శాసనసభ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు అన్నిటిలోను తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఓటరు ఐడి ఉపయోగపడుతుంది. కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోసం నమోదు చేసుకుంటున్నారు. కొత్తగా చేరిన యువ ఓటర్లు తమ ఎలక్ట్రానిక్ ఓటరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక మార్గాలు ఉన్నాయి.

How to Download Electronic Voter id and Check EPIC Number Through Online

ఎలక్ట్రానిక్ ఓటరు కార్డును డౌన్‌లోడ్ చేయడంలో విఫలమైన వారు వెబ్‌సైట్ ద్వారా తమ యొక్క ఓటరు కార్డును పొందవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మార్గదర్శకాల ప్రకారం కొత్త ఓటర్లు ఈ క్రింది పద్ధతులను ఉపయోగించి వారి ఎలక్ట్రానిక్ ఓటరు ఐడి కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

*** మొదట Https://eci.gov.in/e-epic/ లేదా https://www.nvsp.in/ కు వెళ్లి E-EPIC కార్డ్ డౌన్‌లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి. తరువాత పేజీలో nvsp.in సైట్ ఓపెన్ చేయబడి ఉంటుంది. ఇందులో ఇ-ఎపిక్ డౌన్‌లోడ్ ఎంపిక చూపుతుంది.

How to Download Electronic Voter id and Check EPIC Number Through Online

** మొదట ఓటరు ఐడి కార్డు నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ తప్పక నమోదు చేయవలసి ఉంటుంది. తరువాత రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను నమోదు చేసి OTP ని పొంది రిజిస్ట్రేషన్ ను పూర్తి చేసుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత ఓటరు ఫోటో ఐడి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి ఎంపికను ఎంచుకోవాలి. ఇప్పుడు వారు తమ ఇ-ఓటరు ఐడి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

** ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీరు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఎలక్ట్రానిక్ ఓటరు ఐడి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొత్త డిజిటల్ ఓటర్లు దీని ద్వారా ఐడి కార్డు పొందవచ్చు. E-EPIC అనేది ఎలక్ట్రానిక్ ఎలక్షన్ ఫోటో ఐడి కార్డ్. దీనిని PDF ఆకృతిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ పోర్టల్, ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ ప్రాసెసర్ మరియు ఎన్‌విఎస్‌పి ద్వారా ఈ-ఇపిఐసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

** ఓటర్లు తమ ఓటరు ఐడి కార్డు ఉపయోగించి ఓటు వేయడానికి E-EPIC అనుమతిస్తుంది. దీని యొక్క మరిన్ని వివరాలను 1950 హెల్ప్ లైన్ నెంబర్ నుండి పొందవచ్చు.

How to Download Electronic Voter id and Check EPIC Number Through Online

** అలాగే మీరు రిజిస్టర్డ్ ఓటరు అయిఉండి మీ యొక్క ఐడి కార్డును తనిఖీ చేయడానికి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్‌కు వెళ్లి మీ EPIC నంబర్ మరియు స్టేట్ పోస్ట్‌కోడ్‌ను రిజిస్టర్ చేస్తే కనుక మీ పేరు, ఏరియా నంబర్ మరియు పోలింగ్ స్టేషన్ చిరునామా చూపబడతాయి.

Best Mobiles in India

English summary
How to Download Electronic Voter id and Check EPIC Number Through Online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X