Home
News

ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా??

సోషల్ మీడియా ప్రియులకు ఇన్‌స్టాగ్రామ్ ఒక వేదికగా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫోటోలను పోస్ట్ చేయడం మాత్రమే కాదు టిక్‌టాక్ తరహా రీల్స్, సృజనాత్మక ఇన్ఫోగ్రాఫిక్స్ లేదా ఐజిటివిలో దృశ్యపరంగా ఆకర్షణీయమైన ఫుటేజ్ వంటి ఇతర కంటెంట్ ను కూడా అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని వీడియోలు మరియు ఫోటోలను బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీకు సమయం త్వరగా అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో కొన్ని ముఖ్యమైన పనులు లేదా కాల్ వచ్చినప్పుడు మీరు అకౌంట్ పేరును కోల్పోతే ఏమి చేయాలి. వీడియోలను సేవ్ చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి యాప్‌లో అంతర్నిర్మిత ఎంపిక లేనప్పటికీ ఆ వీడియోను పొందడంలో మీకు సహాయపడే కొన్ని టూల్స్ అందుబాటులో ఉన్నాయి. మీ యొక్క స్మార్ట్‌ఫోన్ లో IG వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి మీరు అనుసరించాల్సిన పద్దతుల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Download Instagram Videos on Your Android Smartphone

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం

గూగుల్ ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి అనుమతించే కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉపయోగకరమైన యాప్‌లలో ఒకటి వీడియో డౌన్‌లోడర్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్. ఇది ప్లాట్‌ఫారమ్ నుండి వీడియోను త్వరగా సేవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

స్టెప్ 1- ముందుగా ప్లే స్టోర్ నుండి వీడియో డౌన్‌లోడర్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 2- ఇది పూర్తయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేసి మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి. ఇందులో కుడి వైపు ఎగువ బాగాన ఉన్న మూడు చుక్కల చిహ్నాన్ని నొక్కండి.

స్టెప్ 3- కాపీ లింక్‌ ఎంపిక మీద నొక్కండి.

దశ 4- తర్వాత వీడియో డౌన్‌లోడర్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయండి. ఈ యాప్ లో మీరు కాపీ చేసిన లింక్‌ను పేస్ట్ చేయండి. తరువాత ఇది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయడం ప్రారంభిస్తుంది.

డౌన్‌లోడ్ చేయబడిన వీడియోను మీ Android ఫోన్‌లోని ఫోటోలు లేదా గ్యాలరీ యాప్‌లో నావిగేట్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
How to Download Instagram Videos on Your Android Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X