ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా?

|

బిగో లైవ్ యాప్ తో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం అనేది ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు సంపాదించడానికి వికసించిన అత్యంత పెద్ద ధోరణి. ఇవేకాకుండా బ్లాగింగ్, యూట్యూబ్ మొదలైనవి కూడా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి వున్న కొన్ని గొప్ప మార్గాలు. బిగో లైవ్ యాప్ గురించి మీకు తెలుసా? మీలో కొంత మందికి దాని గురించి తెలిసి ఉండవచ్చు.

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా?

 

కానీ బిగో లైవ్‌తో డబ్బు సంపాదించడం చాలా సులభం అనే వాస్తవం చాలా మందికి తెలియదు. సాధారణంగా బిగో లైవ్ గురించి మరియు లైవ్ వీడియో స్ట్రీమింగ్ సోషల్ యాప్ గురించి ప్రజలకు తెలుసు.

బిగో లైవ్ యాప్‌ - బిగో లైవ్ PCతో డబ్బు సంపాదించడం ఎలా :

బిగో లైవ్ యాప్‌ - బిగో లైవ్ PCతో డబ్బు సంపాదించడం ఎలా :

చాలా మంది ప్రజలు తమ స్నేహితులతో సంభాషించడానికి ఈ యాప్‌ న్ని ఉపయోగిస్తారు. మరికొందరు తమ ప్రతిభను ప్రదర్శించడానికి దీనిని ఉపయోగిస్తారు. వివిధ రకాల ప్రజలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి నృత్యం, పాటలు పాడడం మరియు వంటలు చేయడం వంటి విభిన్న కార్యకలాపాలు చేస్తారు. బిగో లైవ్‌తో డబ్బు సంపాదించాలనే ఆలోచన నుండి చాలా మంది చాలా దూరం అవుతారు. ఒక పోస్ట్ బిగో లైవ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని మీకు అందిస్తుంది.

బిగో లైవ్ యాప్‌ - ఎలా ఉపయోగించాలి?:
 

బిగో లైవ్ యాప్‌ - ఎలా ఉపయోగించాలి?:

బిగో లైవ్ యాప్‌ ని డౌన్‌లోడ్ చేయడం మరియు ఇన్‌స్టాలేషన్ చేయడం చాలా సులభమైన భాగం. బిగో లైవ్ యాప్ ని ఉపయోగించి డబ్బు సంపాదించడం ఎలానో మీకు తెలియకపోతే మీరు ఈ యాప్ ని ఉపయోగించడాన్ని సులభతరం చేయడానికి కొన్ని దశలు క్రింద ఇవ్వబడ్డాయి చదవండి.

* ఈ ప్రక్రియలోమొట్టమొదటిది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా వెళ్లడం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇతర యాప్ రిజిస్ట్రేషన్ల మాదిరిగానే ఉంటుంది.

* ఇందులో నమోదు చేయడానికి మీరు గూగుల్ అకౌంట్ ను ఉపయోగించవచ్చు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను మీరు అందించాలి.

* అన్ని రకాల అనుమతులు విజయవంతంగా నమోదు చేసిన తర్వాత మిమ్మల్ని యాప్ యొక్క హోమ్‌పేజీ ఓపెన్ అవుతుంది.

* హోమ్ పేజీలో అన్ని రకాల ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. మీరు చూడాలి అని అనుకుంటున్న దానిపై క్లిక్ చేయండి. మీరు అన్ని ప్రసారాలను చూడగలుగుతారు కాని ప్రసారకర్త మిమ్మల్ని చూడలేరు.

* మీరు లైవ్ వీడియోను చూస్తున్న వ్యక్తికి టెక్స్ట్ మెసేజ్ లు మరియు బీన్స్ కూడా పంపవచ్చు.

* మీరు మీ యొక్క లైవ్ వీడియోను ప్రారంభించినప్పుడు మాత్రమే మీరు ఏ వినియోగదారుకైనా కాల్స్ చేయగలరు.

మీరు బిగో లైవ్ యాప్ ను ఎలా ఉపయోగించాలి మరియు ఈ యాప్ ను ఉపయోగించి డబ్బును ఎలా సంపాదించవచ్చు అని తెలుసుకోవడానికి కింద చదవండి.

బిగో లైవ్ యాప్ ద్వారా డబ్బు సంపాదించడానికి దశలు:

బిగో లైవ్ యాప్ ద్వారా డబ్బు సంపాదించడానికి దశలు:

ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం చాలా సులభం అనిపించవచ్చు కానీ అది అంత సులువు కాదు. ఈ ప్రక్రియ బిగో లైవ్‌కి కూడా వర్తిస్తుంది. ఈ యాప్ ను ఉపయోగించి డబ్బు సంపాదించడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని ప్రాథమిక దశలు ఉన్నాయి వాటిని ఇప్పుడు చూద్దాం.

* ఇందులో మొదటి దశ మీరు మీ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తున్నారని నిర్ధారించుకోవడం. ఇక్కడ చాలా మంది వారి వివిధ రకాల ప్రతిభలను ప్రదర్శిస్తారు. ఇది మీకు చాలా మంది వీక్షకులను కలిగి ఉందని నిర్ధారిస్తుంది. ఇది డబ్బు సంపాదించడానికి చాలా ముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో ప్రజలు పనిలేకుండా కూర్చోవడం ద్వారా వారి వీడియోలపై చాలా మంది ఫాలోయర్స్ పొందుతారు.

* మీ వీడియోలోని వీక్షకులు మీకు బహుమతులు మరియు నాణేలను కూడా అందించవచ్చు. ఈ నాణేలు మరియు బహుమతులు మీ ప్రొఫైల్ యొక్క బహుమతులు మరియు నాణేల ట్యాబ్‌లో జమ చేయబడతాయి. మీ ప్రొఫైల్‌లో ఉన్న నాణేలు మరియు బహుమతుల సంఖ్యను చూడవచ్చు.

* ఆ ట్యాబ్‌లో నాణేలు ఇతరులకు పంపించడానికి ఎంపికలు కూడా ఉన్నాయని మీరు చూడవచ్చు. అలా కాకుండా వీటిని డబ్బుగా మార్చే ఒక ఎంపిక కూడా ఉంటుంది . మీరు డబ్బును మీ బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేయవచ్చు.

బిగో లైవ్ PC సహాయంతో కూడా మీరు ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు. బిగో లైవ్ యాప్ సహాయంతో డబ్బు సంపాదించడానికి మీరు ఉపయోగించే కొన్ని చిట్కాలు & ఉపాయాలు ఉన్నాయి. ఈ చిట్కాలు & ఉపాయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

చిట్కాలు & ఉపాయాలు:

చిట్కాలు & ఉపాయాలు:

బిగో లైవ్‌లో గెట్ ఫాలోవర్స్‌ను ఉపయోగించగల చిట్కాలు మరియు ఉపాయాలు క్రింద ఇవ్వబడ్డాయి. మరియు ఎక్కువ మంది ఫాలోవర్స్‌ లైవ్ వీడియోలలో ఎక్కువ మంది వీక్షకులను అర్థం చేసుకుంటారు. వీక్షకులు మీకు నాణేలు, బీన్స్ మరియు బహుమతులు అందిస్తారు వీటిని మీరు డబ్బుగా మార్చవచ్చు.

* మిగతా వారి నుండి మిమ్మల్ని వేరుచేసే విధంగా భిన్నమైన వీడియో చేయండి. ఇప్పుడున్న సమయంలో ప్రతిఒక్కరు ఎల్లప్పుడూ క్రొత్తదానిన్ని కోరుకుంటారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు తమ అకౌంట్ ను ఓపెన్ చేసిఉంటారు. మీ యొక్క వీడియో బిన్నంగా ఉంటే కనుక వీడియో ఎక్కువ మంది వీక్షకులను పొందడం ప్రారంభిస్తుంది. రహస్యం ఏమిటంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉంటే ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించవచ్చు.

* చాలా మంది సాహసోపేత వీడియోలను ఇష్టపడతారు. కాబట్టి మీరు కూడా అలాంటివి చేయగలిగితే మీరు ఫాలోవర్స్‌ సంఖ్యను భారీగా ఆశించవచ్చు.

* మీరు మంచి నాణ్యమైన ఫోన్‌ను ఉపయోగించి మీ యొక్క వీడియోను షూట్ చేయాలి. మీ యొక్క లైవ్ వీడియో నాణ్యత స్పష్టంగా లేకపోతే మీరు ఫాలోవర్స్‌ సంఖ్యను ఆశించలేరు.

* చివరిగా మీరు రోజుకు కనీసం ఒక వీడియో అయిన చేయడమే. ఇది మీరు చురుకుగా ఉన్నారని మరియు మీ వీడియోల కోసం ఎదురుచూస్తున్న మీ ఫాలోవర్స్‌కు తెలియజేస్తుంది.

చివరగా బిగో లైవ్ యాప్ ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ఒక గొప్ప వేదిక. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంకా ప్రాచుర్యం పొందలేదు కాని ఇది ఆగ్నేయాసియాలో బాగా ప్రాచుర్యం పొందింది . వీలైనంత త్వరగా ఈ యాప్ ను పొందాలని మరియు మీ స్వంత వీడియోలను తయారు చేయడం ప్రారంభించాలని భావిస్తున్నాము.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Earn Money Online From Bigo Live Video App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X