ఇమేజిలను బ్లాగులో నిక్షిప్తం చేయడం ఎలా..?

Posted By: Staff

ఇమేజిలను బ్లాగులో నిక్షిప్తం చేయడం ఎలా..?

చాలా మంది పాఠకులకు వారికి తెలిసిన సమాచారాన్ని బ్లాగులలో పెట్టాలనే కుతూహాలం ఉంటుంది. ఐతే బ్లాగుకి సంబంధించిన సమాచారం మొత్తం ఖచ్చితంగా వ్రాసినప్పటికీ వాటికి సంబంధించిన ఇమేజిలను నిక్షిప్తం చేయడంలో కొంత ఇబ్బందికి గురి అవతుంటారు. అలా ఇబ్బందులకు గురైన పాఠకుల కోసం ప్రత్యేకంగా ఈరోజు ఇమేజిలను ఇంటర్నెట్లో వెతికి వాటికి బ్లాగులలో ఎలా నిక్షిప్తం చేయడమో తెలుసుకుందాం..

ఇందు కోసం గాను ఇంటర్నెట్లో వైలియో.కామ్ యూజర్స్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ యూజర్స్ చేయాల్సిందిల్లా వైలియో.కామ్ వెబ్‌సైట్ లోకి వెళ్లి కావాల్సిన ఇమేజి పేరుని అక్కడ టైపు చేసి సెర్చ్ బటన్‌ని క్లిక్ చేయడమే. యూజర్స్ సెర్చ్ బటన్‌పై క్లిక్ చేసిన వెంటనే కావాల్సిన ఇమేజిలు క్షణాల్లో ప్రత్యక్షం అవుతాయి.

ఆ తర్వాత కావలసిన ఇమేజ్ పై క్లిక్ చేస్తే Adjustments పేజీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఇమేజ్‌ని రీసైజ్ చేసుకోవచ్చు మరియు ఎలైన్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత "get the code' పై క్లిక్ చేస్తే మీ బ్లాగుకి అనుసంధానం చేసుకోవటానికి కోడ్ వస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot