Chrome బుక్‌మార్క్‌లను ఎక్సపోర్ట్ చేయడం ఎలా?

|

చాలా వెబ్ బ్రౌజర్‌ల మాదిరిగానే గూగుల్ క్రోమ్ కూడా వెబ్ పేజీలను బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. తద్వారా మీరు వాటిని తిరిగి మళ్లీ యాక్సిస్ చేయడానికి వాటిని సులభంగా కనుగొనవచ్చు. మీ గూగుల్ అకౌంటుకు క్రోమ్ లింక్ చేయబడి ఉంటే కనుక మీరు క్రోమ్ వెబ్ బ్రౌజర్ ద్వారా ఏ పరికరంలోనైనా ఆ బుక్‌మార్క్‌లను యాక్సెస్ చేయవచ్చు. అవన్నీ తేలికగా అనిపించినప్పటికీ మీరు మీ బుక్‌మార్క్‌లను మరొక వెబ్ బ్రౌజర్‌లో లేదా మీ గూగుల్ అకౌంటులోకి లాగిన్ చేయలేని పరికరంలో యాక్సెస్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయాలలో క్రోమ్ బుక్‌మార్క్‌లను మరొక డివైస్ లేదా బ్రౌజర్‌కి ఎగుమతి చేయాలని చూస్తుంటే కనుక కింద తెలిపే సులభమైన గైడ్ ను అనుసరించండి.

PCలో క్రోమ్ నుండి బుక్‌మార్క్‌లను ఎగుమతి చేసే విధానం

PCలో క్రోమ్ నుండి బుక్‌మార్క్‌లను ఎగుమతి చేసే విధానం

స్టెప్ 1: మీ PCలో గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: బ్రౌజర్ యొక్క కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు నిలువు చుక్కల చిహ్నం మీద క్లిక్ చేయండి.

స్టెప్ 3: బుక్‌మార్క్‌లను క్లిక్ చేసి ఆపై 'బుక్‌మార్క్ మేనేజర్‌' ఎంపికని ఎంచుకోండి.

స్టెప్ 4: బుక్‌మార్క్ మేనేజర్ మెనులో ఉన్న మూడు నిలువు చుక్కల చిహ్నాన్ని క్లిక్ చేయండి.

స్టెప్ 5: తరువాత ఎక్సపోర్ట్ బుక్‌మార్క్‌ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 6: ఇప్పుడు 'సేవ్ యాజ్ మెను' ఎంపిక కనిపిస్తుంది. మీరు మీ బుక్‌మార్క్‌లను ఎక్సపోర్ట్ చేయాలనుకుంటున్న స్థానానికి బ్రౌజ్ చేయండి. ఫైల్ కోసం పేరును నమోదు చేయండి మరియు "టైప్" HTML డాక్యుమెంట్ కి సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి.

స్టెప్ 7: తర్వాత 'సేవ్' ఎంపికపై క్లిక్ చేయండి.

 

Samsung గెలాక్సీ M13 5G & M13 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవిగో  Samsung గెలాక్సీ M13 5G & M13 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవిగో  

Androidలో Chrome బుక్‌మార్క్‌లను ఎగుమతి చేసే విధానం

Androidలో Chrome బుక్‌మార్క్‌లను ఎగుమతి చేసే విధానం

గూగుల్ క్రోమ్ మొబైల్ యాప్ యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ నుండి బుక్‌మార్క్‌లను ఎక్సపోర్ట్ చేయడానికి గూగుల్ క్రోమ్ మిమ్మల్ని అనుమతించదు కానీ మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి క్రోమ్ యొక్క సమకాలీకరణ ఫీచర్ ని ఉపయోగించవచ్చు. మీరు మీ మొబైల్ బుక్‌మార్క్‌లను ఇతరుల నుండి వేరు చేయాలనుకుంటే కనుక మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే మూడవ పార్టీ యాప్‌ను కూడా ఉపయోగించవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే మీరు క్రోమ్ ని ఉపయోగిస్తున్న అన్ని పరికరాలలో క్రోమ్ బుక్‌మార్క్‌లు సమకాలీకరించబడతాయి. మీరు మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ఏది కూడా ఎగుమతి చేయాల్సిన అవసరం లేదని ఇది నిర్ధారిస్తుంది.

బుక్‌మార్క్‌

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ డివైస్ లో క్రోమ్ ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: స్క్రీన్ కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు నిలువు చుక్కల చిహ్నం మీద నొక్కండి.

స్టెప్ 3: తరువాత సెట్టింగ్‌లను ఎంచుకోండి.

స్టెప్ 4: Sync మెనుని ఓపెన్ చేయడానికి Sync ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 5: అన్నింటినీ Sync చేయడానికి స్లయిడర్‌ను ఆన్ స్థానానికి సెట్ చేయండి లేదా దాన్ని ఎంపిక చేయకుండా వదిలివేసి మీరు Sync చేయాలనుకునే అంశాల ప్రక్కన ఉన్న బాక్స్ లను టిక్ చేయండి. ఈ రెండు ఎంపికలతో బుక్‌మార్క్‌లు ఎంచుకోబడతాయని నిర్ధారించుకోండి.

స్టెప్ 6: ఆపై మీ PCకి వెళ్లి క్రోమ్ ని ఓపెన్ చేయండి.

స్టెప్ 7: ఇప్పుడు మూడు నిలువు చుక్కల చిహ్నంపై క్లిక్ చేయండి.

స్టెప్ 8: బుక్‌మార్క్‌ని ఎంచుకుని 'బుక్‌మార్క్ మేనేజర్‌' ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 9: మూడు నిలువు చుక్కల చిహ్నాలపై క్లిక్ చేసి ఎక్సపోర్ట్ బుక్‌మార్క్‌ ఎంపికలను ఎంచుకోండి.

స్టెప్ 10: మీ బుక్‌మార్క్‌ల ఎగుమతి ఫైల్ కోసం పేరును టైప్ చేయండి. మీకు కావాలంటే ట్యాగ్‌లను జోడించండి. ఫైల్‌ను ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకోండి. ఫార్మాట్ HTML టెక్స్ట్‌కి సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి.

స్టెప్ 11: సేవ్ ఎంపికపై క్లిక్ చేయండి.

 

iOSలో Chrome బుక్‌మార్క్‌లను ఎగుమతి చేసే విధానం

iOSలో Chrome బుక్‌మార్క్‌లను ఎగుమతి చేసే విధానం

ఆండ్రాయిడ్ పరికరాల మాదిరిగానే గూగుల్ క్రోమ్ యొక్క iOS వెర్షన్‌లో కూడా బుక్‌మార్క్‌ ఎక్సపోర్ట్ ఫీచర్లు లేవు. అందువల్ల మీ అన్ని బుక్‌మార్క్‌లు మీ PCతో Sync చేయబడటం కొనసాగుతుంది. మీరు మీ మొబైల్ పరికరంలో ఉపయోగించాలనుకుంటున్న బుక్‌మార్క్‌లను ఎంచుకోవడానికి ఇది మీకు ఎంపికను ఇస్తుంది.

స్టెప్ 1: iOSలో క్రోమ్ యాప్ ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: స్క్రీన్ కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు నిలువు చుక్కల చిహ్నంపై నొక్కండి.

స్టెప్ 3: ఆపై బుక్‌మార్క్‌ల ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: మీరు మీ సేవ్ చేసిన బుక్‌మార్క్‌ల జాబితాను చూస్తారు. స్క్రీన్ ఎడమవైపు ఎగువ మూలలో గల బ్యాక్ యారోని నొక్కండి.

స్టెప్ 5: మీరు ఇప్పుడు మీ ఇతర పరికరాల క్రోమ్ బ్రౌజర్ నుండి బుక్‌మార్క్‌లను ఎంచుకోవచ్చు. బుక్‌మార్క్‌ల సెట్‌ను లోడ్ చేయడానికి ఫోల్డర్‌లలో దేనినైనా నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Export Google Chrome Bookmarks on PC, Android and ios

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X