Home
News

ప్రావిడెంట్ ఫండ్ ఆన్‌లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవడం ఎలా ?

By Gizbot Bureau

ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) సబ్‌స్క్రైబర్స్ తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను ఉద్యోగిగా ఉన్న సమయంలోను విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ అన్ని సందర్భాలలోనూ వెనక్కి తీసుకోలేం. ఉద్యోగం చేస్తున్నప్పటికీ పీఎఫ్ మొత్తాన్ని ఏయే సందర్భాలలో వెనక్కి తీసుకోగలమంటే..

అనారోగ్యం, పెళ్లి ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు

అనారోగ్యం, పెళ్లి ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, ఇంటి కొనుగోలు, కొత్త ఇంటి నిర్మాణం, ప్రత్యేక సందర్భాల్లో రుణ చెల్లింపులు వంటి సమయాల్లో మాత్రమే పీఎఫ్‌ను వెనక్కి తీసుకోగలం. పీఎఫ్ సబ్‌స్క్రైబర్స్ నెలకు పైగా ఉద్యోగం లేకుండా ఉంటే 75 శాతం విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ గత ఏడాది అనుమతి ఇచ్చింది. వరుసగా రెండు నెలలకు పైగా ఉద్యోగం లేకుండా ఉంటే మిగతా 25 శాతం పీఎఫ్ ఖాతా డబ్బులు కూడా ఉపసంహరించుకోవచ్చు. పీఎఫ్ ఉపసంహరణ కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో కూడా సులభంగా దరఖాస్తు చేసుకొని విత్ డ్రా చేసుకోవచ్చు.

ఇవి తప్పనిసరిగా ఉండాలి

ఇవి తప్పనిసరిగా ఉండాలి

ఈపీఎఫ్ మొత్తం నుంచి కొంత డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవడానికి సబ్‌స్క్రైబర్‌కి కచ్చితంగా యాక్టివ్ యూఏఎన్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఈపీఎఫ్‌వో డేటాబేస్‌లో ఉద్యోగి ఆధార్ వివరాలు నిక్షిప్తమవ్వాలి. సభ్యుడి బ్యాంక్ అకౌంట్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐఎఫ్ఎస్‌సీ) వంటి వివరాలు కూడా ఈపీఎఫ్‌వో డేటా బేస్‌లో ఉండాలి. లేదంటే ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేసుకోవడం సాధ్యపడదు. ఇకపోతే ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ పాక్షిక విత్‌డ్రాకు ఎలాంటి డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం లేదు.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్ డ్రా ఎలాగంటే? - 

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్ డ్రా ఎలాగంటే? - 

మొదట ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ 

  • ఆ తర్వాత మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత కాప్చా అడుగుతుంది. అది సరిగ్గా ఎంటర్ చేసి, సైనిన్ కావాలి.
  •  ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కుడివైపున మెంబర్ ప్రొఫైల్ చూడవచ్చు. 
  • ఆ తర్వాత 'manage' ట్యాబ్‌ను క్లిక్ చేయండి. KYC ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • తర్వాత పేజీలో ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత క్లెయిమ్ (Form-31,19 & 10C)ని ఎంచుకోండి.
  •  ఇప్పుడు అక్కడ మెంబర్ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లోని చివరి నాలుగు నెంబర్లను ఎంటర్ చేయాలి. 
  • ఆ తర్వాత 'I want to apply for' నుంచి ఫాం 31ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం 'Proceed for online claim' పైన క్లిక్ చేయండి.
  • పది రోజుల్లో అకౌంట్లో డబ్బులు 

    పది రోజుల్లో అకౌంట్లో డబ్బులు 

    ఆ తర్వాత ఈపీఎఫ్ఓ మీ 'కేవైసీ' వివరాలను కలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రొసీడ్ అవుతుంది. అంటే అప్పుడు మీ విత్ డ్రా ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అప్రూవ్ అయిన పది రోజుల్లో మీ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి.

Best Mobiles in India

English summary
How To File An Online Claim For Provident Fund Withdrawal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X