ఇన్ కమింగ్ కాల్స్ లో మీ ఫోన్ స్క్రీన్ ఆన్ అవ్వట్లేదా ? ఇలా చేయండి.

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లును అసలు ఊహించలేము. మ‌న‌కు స్మార్ట్‌ఫోన్ ఉంటే దానితో చాలా ప‌నులు చేసుకోవ‌చ్చు. కేవ‌లం కాల్స్ మాత్ర‌మే కాక చాటింగ్‌, ఫొటోలు తీసుకోవడం, బ్రౌజింగ్ ఇలా చాలా టాస్క్‌లు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే కాల్స్ కోసం మాత్ర‌మే ఫోన్ వాడే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు.

How to fix display not waking up with incoming calls issue

మనం కాల్స్ తీసుకునేట‌ప్పుడు కొన్నిసార్లు సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతుంటాయి. మ‌న‌కు కాల్ వ‌చ్చినా ఒక్కోసారి ఇవి స్క్రీన్ మీద క‌నిపించ‌వు. మ‌ళ్లీ కాల్ లాగ్ లోకి వెళ్లి ఎవరు ఫోన్ చేశారో చూసుకోవాలి. మ‌రి ఇలా ఎందుకు జ‌రుగుతుంది. మ‌న‌కు క‌నిపించ‌ని ఫోన్ కాల్‌ని మ‌న స్క్రీన్ మీద క‌నిపించేలా ఫిక్స్ చేయ‌డం ఎలా?

రీస్టార్ట్ చేయాలి

రీస్టార్ట్ చేయాలి

మ‌న‌కు కాల్ వ‌చ్చినా క‌నిపించ‌క‌పోతే వాటిని ఫిక్స్‌చేసే ముందు ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లే ముందు ఫోన్‌ను రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక‌సారి రీస్టార్ట్ చేయ‌గానే మీ ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయిపోతుంది. ఒక‌వేళ సాల్వ్ కాక‌పోతే ఇంకా భిన్న‌మైన ప‌రిష్కారాలు అందుబాటులో ఉన్నాయి.

 ఇన్‌క‌మింగ్ కాల్స్ నోటిఫికేష‌న్స్‌ అనేబుల్

ఇన్‌క‌మింగ్ కాల్స్ నోటిఫికేష‌న్స్‌ అనేబుల్

అందులో ప్ర‌ధాన‌మైంది ఇన్‌క‌మింగ్ కాల్స్ నోటిఫికేష‌న్స్‌ని అనేబుల్ చేయ‌డం. ప్ర‌తి ఫోన్లో ఇన్‌క‌మింగ్ కాల్స్ నోటిఫికేషన్లు డిఫాల్ట్‌గా అనేబుల్ అవుతాయి. ఒక‌వేళ లేక‌పోతే థ‌ర్డ్ పార్టీ యాప్ ద్వారా కూడా ఛేంజ్ చేసుకోవ‌చ్చు .ఫోన్ యాప్ ద్వారా మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఛేంజ్ చేసుకోవ‌చ్చు.

క్లియ‌ర్ క్యాచె అండ్ డేటా

క్లియ‌ర్ క్యాచె అండ్ డేటా

ఫోన్ యాప్ ద్వారా ఫోన్లో ఉండే క్యాచెని డేటాని క్లియ‌ర్ చేయాలి. అయితే క్యాచెని తీసేయ‌డం వ‌ల్ల మీ డేటాకు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌దు. అయితే క్యాచెని తీసేయ‌డం వ‌ల్ల మొత్తం ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయిపోదూ.. యాప్ డేటాను కూడా తీసేయాలి. డేటాను క్లియ‌ర్ చేయ‌డం ద్వారా మీ కాల్ హిస్ట‌రీ క్లియ‌ర్ అవుతుంది.

యాప్ సెట్టింగ్స్ రిసెట్

యాప్ సెట్టింగ్స్ రిసెట్

ఆ త‌ర్వాత ఫోన్ యాప్ సెట్టింగ్స్ రిసెట్ చేసుకోవ‌చ్చు. యాప్ ప్రిఫ‌రెన్సెస్ రిసెట్ చేయ‌డం ద్వారా కూడా మ‌నం డేటాను సేవ్ చేసుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైన ప‌ర్మిష‌న్స్ ఇవ్వ‌డం ద్వారా కూడా మ‌న స్క్రీన్ మీద వ‌చ్చే కాల్స్, మెసేజ్‌ల‌ను పిక్స్ చేసే అవ‌కాశం ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to fix display not waking up with incoming calls issue

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X