జియో బార్ కోడ్‌ని క్షణాల్లో పొందడమెలా..?

Written By:

జియో ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న ఒకే ఒకపదం. అయితే జియో సిమ్ ను తీసుకోవాలని చాలామంది జియో షో రూలంకు వెళ్లి వెనక్కి వచ్చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ జియో సిమ్ కోసం రిలయన్స్ వాళ్లు బార్ కోడ్ అడుగుతుంటారు. జియో యాప్స్ డౌన్ లోడ్ చేసిన చాలామందికి ఈ బార్ కోడ్ అప్ డేట్ అవ్వదు. కోడ్ జనరేట్ కాకపోవడం వల్ల చాలామంది జియో సిమ్ ను తీసుకోలేకపోతున్నారు. అయితే అలాంటి వారు ఈ కింది స్టెప్స్ ద్వారా బార్ కోడ్ పొందవచ్చు.

ఏడాదికి లక్ష ఫోన్లు టాయిలెట్లలోకి, ఎక్కడో తెలుసా !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో యాప్స్ ద్వారా కోడ్ జనరేట్

మై జియో యాప్ ని 4జీ సపోర్ట్ చేయని ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అందుకని కంపెనీ ఫోన్ ట్రాకింగ్ చేయడానికి బగ్ సాల్వ్ చేసింది. అందువల్ల ప్లే స్టోర్ లో ఉన్న జియో యాప్స్ ద్వారా కోడ్ జనరేట్ కావడం లేదు.

My Jio Apkని డౌన్ లోడ్

అయితే దీనికి మీరు వేరే దారిలో ట్రై చేయవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ నుంచి నేరుగా My Jio Apkని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా కోడ్ పొందవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి

సెక్యూరిటీ ఆప్సన్

ఆ తరువాత అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ కాకుంటే మీరు వెంటనే ఫోన్ సెట్టంగ్స్ లో కెళ్లి సెక్యూరిటీ ఆప్సన్ దగ్గర అన్ నౌన్ సోర్సెస్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయడం ద్వారా మీరు ఈ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apkని సపోర్ట్ చేసే ఫైల్

అదీ ఎనేబుల్ చేసినా My Jio Apk ఓపెన్ కాలేదంటే మీ ఫోన్ లో Apkని సపోర్ట్ చేసే ఫైల్ లేదని అర్థం.ఇందుకోసం మీరు ప్లే సోర్ట్ నుండి Apk ఇన్ స్టాల్ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. లింక్ కోసం క్లిక్ చేయండి

గెట్ జియో సిమ్

అది డౌన్ లోడ్ అయిన తరువాత మీరు My Jio Apk ఫైల్ ఓపెన్ చేసి ఇన్ స్టాల్ చేస్తే మీకు గెట్ జియో సిమ్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు జియో బార్ కోడ్ పొందవచ్చు.

రీ డీమ్డ్

అయితే చాలామంది ముందే బార్ కోడ్ తీసుకుని ఉంటారు. వారికి కోడ్ జనరేట్ అవ్వదు..అలా ముందే బార్ కోడ్ చేసుకున్న మొబైల్స్ లో రీ డీమ్డ్ అని చూపిస్తుంది. ఇది ఉంటే మీరు జియో సిమ్ పొందలేరు.

కోడ్ జనరేట్ అయిన తరువాత

కోడ్ జనరేట్ అయిన తరువాత మీరు సమీప స్టోర్లలో కెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు సబ్ మిట్ చేస్తే మీకు జియో సిమ్ ఇస్తారు.

ఇమేజ్ రూపంలో

మీకు కోడ్ జనరేట్ అయిన తరువాత దాన్ని అది మీ ఫోటో పోల్టర్ లోకి ఆటోమేటిగ్గా ఇమేజ్ రూపంలో వస్తుంది. అలా రాకుంటే మీరు వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ కోసం పవర్ బటన్ , వాల్యూమ్ డౌన్ బటన్ ఒకే సారి ప్రెస్ చేస్తే సరిపోతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to generate JIO Welcome offer bar code in seconds Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot