రూ.93కే 10జీబి 4జీ ఇంటర్నెట్, కానీ ఒక కండీషన్

సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే 4జీ టారిఫ్ ప్లాన్‌లను ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రిలయన్స్ జియో. దేశ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపింది. ఇటు మొబైల్ ఇంటర్నెట్ విభాగంలోనే కాకుండా అటు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ విభాగంలోను సత్తాచాటేందుకు జియో సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.

రూ.93కే 10జీబి 4జీ ఇంటర్నెట్, కానీ ఒక కండీషన్

Read More : రూ.33కే నెలంతా ఎయిర్‌టెల్ ఇంటర్నెట్

త్వరలోనే జియో లాంచ్ చేయబోతున్న Gigafiber broadband service 4జీ విభాగంలో మరో సంచలనానికి దారి తీయనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జియో నెట్‌వర్క్ పై రిలయన్స్ అందిస్తోన్న వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్ 31, 2016 వరకు అన్ని జియో సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

RCom యూజర్ల కోసం...

తాజాగా RCom CDMA యూజర్ల కోసం రిలయన్స్ జియో ఆసక్తికర ఆఫర్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా RCom CDMA నుంచి జియో నెట్‌వర్క్‌లోకి మైగ్రేట్ అయ్యే యూజర్లకు రూ.93కే 10జీబి 4జీ డేటాను జియో అందిస్తోంది. కొన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్ విలువ రూ.97గా ఉంది.

ఇప్పటికే 90 శాతం మంది యూజర్లు..

రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత 80 లక్షల మంది అంటే దాదాపు 90శాతం మంది RCom నెట్‌వర్క్ యూజర్లు జియో 4జీ సర్వీసులోకి మారిపోయినట్లు తెలుస్తోంది.

రూ.93కే 10జీబి 4జీ డేటా..

రూ.93కే 10జీబి 4జీ డేటా అంటే సాధారణ విషయం కాదు. అంటే ఒకే జీబి డేటా ఖరీదు వచ్చేసరికి రూ.9కూడా పడలేదు. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో జియో ఎలాంటి ఆఫర్లు అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ ఆఫర్ మనకు స్ఫష్టం తెలియజేస్తుంది.

మరో షాకింగ్ విషయం ఏంటంటే...

మరో షాకింగ్ విషయం ఏంటంటే రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా CDMA సర్వీసులను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's How to Get 10 GB 4G Data from Reliance Jio at Just Rs.93. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot