అందరికి 5జీబి ఇంటర్నెట్ ఉచితం, సంచలనం రేపుతోన్న Airtel కొత్త ఆఫర్లు

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రతి ఒక్కరికి 5జీబి ఇంటర్నెట్ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తూ మార్కెట్లో పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోని ప్రతి ఒక్కరు ఈ ఉచిత డేటాను పొందవచ్చు.

అందరికి 5జీబి ఇంటర్నెట్ ఉచితం, సంచలనం రేపుతోన్న Airtel కొత్త ఆఫర్లు

Read More : 52 కోట్ల కాల్స్‌ ఫెయిల్ అయ్యాయి, జియో సంచలన ఆరోపణ

పొందిన డేటాను 2జీ, 3జీ, 4జీ ఇలా ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉపయోగించుకోవచ్చు. మీ ఫోన్ UMTS modeను మార్చుకోవటం ద్వారా నెట్‌వర్క్ మోడ్ మారుతుంది. ఇందుకు మీరు ఫోన్ Settingsలోకి వెళ్లి → Connections → More Networks → Mobile Networks → Network Modeను మార్చుకంటే సరిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ముందుగా myAirtel appను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తరువాత యాప్‌లో మీ 10 డిజిట్ ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయటం ద్వారా వన్‌టైమ్ పాస్‌వర్డ్ మీ ఫోన్‍‌కు అందుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మీకు కొన్ని కండీషన్స్‌తో కూడిన 5జీబి ఉచిత ఇంటర్నెట్ లభిస్తుంది.

#2

ఎయిర్‌టెల్ అందిస్తోన్న ఉచిత 5జీబి ఇంటర్నెట్ రాత్రి వేళ్లలో మాత్రమే వాడుకోవాలి. అదికూడా రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే.

#3

myAirtel app ద్వారా మీరు రూ.200 అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని రీచార్జ్ చేసినట్లయితే మీకు 1జీబి డేటా ఉచితంగా లభిస్తుంది.

#4

మీ myAirtel app యాప్‌లోని Airtel Walletలో రూ.100 లోడ్ చేయటం ద్వారా 500 MB ఇంటర్నెట్ మీకు ఉచితంగా లిభిస్తుంది.

#5

మీ వాలెట్ ద్వారా రూ.100కంటే ఎక్కువ మొత్తాన్ని మరో myAirtel app యూజర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయటం ద్వారా మీకు అదనంగా 500MBఇంటర్నెట్ లభిస్తుంది.

#6

ఎయిర్ టెల్ Wynk మ్యూజిక్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని 10 పాటలను వినటం ద్వారా మీకు 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది. Wynk గేమ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని అన్ లాక్ చేయటం ద్వారా మీకు 700 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది.

#7

Wynk మూవీ యాప్‌లో సినిమాలు చూడటం ద్వారా 1జీబి ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది. Wynk మ్యూజిక్ యాప్‌ నుంచి ఒక పాటను మీరు పూర్తిగా డౌన్ లోడ్ చేసుకున్నట్లయితే 200 ఎంబి ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది.

#8

మీ Airtel Wallet నుంచి మీ మిత్రులకు రూ.10 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయటం ద్వారా 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది

#9

myAirtel app లింక్‌ను మీ మిత్రులకు షేర్ చేసి, వారు కూడా దానిని ఉపయోగించుకునేలా చేసినట్లయితే 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Get 5 GB Data for FREE from Airtel: 7 Things to Know. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot