అమెజాన్ ప్రైమ్ ఉచితంగా పొందడానికి సింపుల్ గైడ్

By Gizbot Bureau
|

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కలిగిన వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆర్డర్ చేసని మరుసటి రోజే డెలివరీ అలాగే Prime Video and Prime Music ఇలా అనేక రకాలైన సదుపాయాలను అందుకోవచ్చు. అమెజాన్ ప్రతి పండుగ సమయంలో కాని అలాగే ఇతర సంధర్భాల్లో కాని అందరికంటే ముందుగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ వారికి మాత్రమే ప్రయోజనాలను అందిస్తోంది.

How to get Amazon Prime for free

ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నవారికి ఏడాదంతా ప్రత్యేకమైన సేవలు లభిస్తాయి. అమెజాన్‌లో ఏదైనా వస్తువు కొంటే డెలివరీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రైమ్ మెంబర్స్‌కు ఉచిత డెలివరీ సౌకర్యం ఉంటుంది. ఇక ప్రైమ్ వీడియోలో సినిమాలు, ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ చూడొచ్చు.

 ఏడాదికి రూ.999, నెలకు రూ.129

ఏడాదికి రూ.999, నెలకు రూ.129

ప్రైమ్ వీడియోను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌తో పాటు ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌, స్మార్ట్ టీవీలో వాడుకోవచ్చు. ప్రైమ్ మెంబర్స్‌కు ప్రైమ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ కూడా ఉచితం. ఇలా అమెజాన్ ప్రైమ్‌తో అనేక లాభాలు. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఏడాదికి రూ.999, నెలకు రూ.129 చెల్లించాలి.

 ఉచితంగా పొందే అవకాశం

ఉచితంగా పొందే అవకాశం

షాపింగ్ నుంచి వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ వరకు అనేక సేవలు అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందే అవకాశం వస్తే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. కొన్ని కంపెనీలు తమ ప్రొడక్ట్స్ కొన్నా, సర్వీసుల్ని వాడుకున్నా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా ఇస్తున్నాయి.

 టెలికాం ఆఫర్లు

టెలికాం ఆఫర్లు

భారతీ ఎయిర్‌టెల్ తమ వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం రూ.1,099 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్ ఎంచుకోవాలి. ఇక ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితమే. ఇక రూ.499 నుంచి ప్లాన్స్ తీసుకునే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కూడా అమెజాన్ ప్రైమ్ ఉచితం.

వొడాఫోన్,బీఎస్ఎన్ఎల్

వొడాఫోన్,బీఎస్ఎన్ఎల్

ఎయిర్‌టెల్ లాగానే బీఎస్ఎన్ఎల్ కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తోంది. ఎంపిక చేసిన సర్కిళ్లల్లో కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. భారత్ ఫైబర్ సబ్‌స్క్రైబర్లకు కూడా ఈ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది. మరోవైపు వొడాఫోన్ కూడా రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ తీసుకున్నవారికి ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇస్తోంది. రూ.399 నుంచి ఏ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్నా అమెజాన్ ప్రైమ్ ఉచితంగా పొందొచ్చు. కొద్దిరోజుల క్రితం టాటా స్కై బింజ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్ పొందిన కస్టమర్లకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ లభిస్తుంది. నెలకు రూ.249 చెల్లిస్తే చాలు.

Amazon Prime free trial

Amazon Prime free trial

దీంతో పాటుగా కొత్తగా లాగిన్ అయ్యే కస్టమర్లకు Amazon Prime free trial అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు 30 రోజుల పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ పొందవచ్చు. మీరు అందులో కార్డు వివరాలు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇటీవల అమెజాన్ 18-24 ఏళ్ల యువతకు 50 శాతం క్యాష్‌బ్యాక్(రూ.500) ఇస్తోంది. అంటే వారికి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రూ.499 మాత్రమే.

Best Mobiles in India

English summary
How to get Amazon Prime for free

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X