ఆండ్రాయిడ్ స్క్రీన్ మీద లైవ్ స్కోర్ పొందడం ఎలా ?
మీరు క్రికెట్ ప్రేమికులా.... ఎప్పటికప్పుడు స్కోర్ అప్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. స్కోర్ తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.. అయితే చింతించకండి, ఎందుకంటే మిగతా వాటిలాగే, ఈ సమస్యను కూడా జాగ్రత్తగా చూసుకునే పరిష్కరించుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. స్కోర్‌ని మీరు నేరుగా ఆండ్రాయిడ్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. లైవ్ స్కోర్ ని నేరుగా మీ ఆండ్రాయిడ్ స్క్రీన్ మీద అప్ డేట్ చేసుకునేలా మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు వైబ్ సైట్లోకి వెళ్లకుండా మీ ఫోన్ లాక్‌స్క్రీన్‌లోనే క్రికెట్ మ్యాచ్‌ల యొక్క ప్రత్యక్ష స్కోర్‌లను చూసే అవకాశం అందుబాటులో ఉంది. అదెలాగో ఓ సారి చూద్దాం.

ఇందుకు ముఖ్యమైనవి
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేటెస్ట్ వర్షన్ ఉండాలి.
గూగుల్ యాప్ లేటెస్ట్ వర్షన్ ఉండాలి.
ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇవి ఉన్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ మీద లైవ్ స్కోర్ పొందడం ఎలాగో చూద్దాం.

గూగుల్ సెర్చ్ విడ్జెట్
మీ గూగుల్ సెర్చ్ విడ్జెట్ నుండి గూగుల్ యాప్ ఓపెన్ చేయండి.
అక్కడ మీరు స్పోర్ట్ అనే ఆప్సన్ ఎంచుకోండి
అక్కడ మీకు లేటెస్ట్ అప్ డేట్ అలాగే జరుగుతున్న మ్యాచ్‌లు , అలాగే జగరబోయే మ్యాచ్‌లు గురించి సమాచారం ఉంటుంది.
అందులో సెర్చ్ రిజల్ట్ నుండి స్కోర్స్ ని ట్యాబ్ ని ట్యాప్ చేయండి.

ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో
ఆ తర్వాత ఏ మ్యాచ్ మీకు చూడాలనుకుంటున్నారో దాన్ని హోమ్ స్క్రీన్ మీద పిన్ చేసుకోండి
ఆ తర్వాత పిన్ లైవ్ స్కోర్ ని ట్యాప్ చేయండి

గూగుల్ క్రోమ్ బ్రౌజర్
దీన్ని మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుండి కూడా చేసుకోవచ్చు. బ్రౌజర్ ని ఓపెన్ చేసి అందులో స్పోర్ట్ బటన్ ని ప్రెస్ చేసి పై మెథడ్ ఫాలో అయిత సరిపోతుంది. ఇందులో మీరు పుట్ బాల్, క్రికెట్ వంటి వాటిని సెట్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications