వాట్సాప్‌లో డిజిలాకర్ సర్వీస్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను పొందడం ఎలా?

|

MyGov తన వాట్సాప్ చాట్‌బాట్‌లో కొత్తగా మరొక సర్వీసును ప్రారంభించింది. వాట్సాప్‌లో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌లను యాక్సెస్ చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది. కొత్త ఫీచర్ తో ప్రభుత్వం తన యొక్క అన్ని రకాల సేవలను అందించడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త డిజిలాకర్ సర్వీసును యాక్సెస్ చేయడానికి వినియోగదారులు వాట్సాప్‌లో MyGov హెల్ప్‌డెస్క్‌ని ఉపయోగించగలరు. వాట్సాప్‌లో డిజిలాకర్ అకౌంటును సృష్టించడం మరియు యాక్సిస్ చేయడంతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేయడానికి వీలు ఉంటుంది. వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సిటిజన్ సపోర్ట్ సేవలను అందిస్తుంది. వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్ తో ప్రభుత్వ సేవలను పౌరులు సులభంగా పొందవచ్చు.

 

వాట్సాప్‌లో డిజిలాకర్ సర్వీస్ ద్వారా పొందగలిగే ప్రభుత్వ డాక్యుమెంట్లు

వాట్సాప్‌లో డిజిలాకర్ సర్వీస్ ద్వారా పొందగలిగే ప్రభుత్వ డాక్యుమెంట్లు

డిజిలాకర్ హెల్ప్‌డెస్క్ యూజర్ల యొక్క ఈ కింది డాక్యుమెంట్లను సులభంగా యాక్సెస్ చేయగలదు.

** పాన్ కార్డ్
** డ్రైవింగ్ లైసెన్స్
** CBSE 10th తరగతి సర్టిఫికేట్
** వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
** ఇన్సూరెన్స్ పాలసీ - టూ వీలర్
** క్లాస్ X మార్క్‌షీట్
** క్లాస్ XII మార్క్‌షీట్
** ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ (డిజిలాకర్‌లో లైఫ్ మరియు నాన్-లైఫ్ అందుబాటులో ఉంది)

 

వాట్సాప్‌లోని డిజిలాకర్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను పొందే విధానం
 

వాట్సాప్‌లోని డిజిలాకర్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను పొందే విధానం

** వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను పొందడానికి మీరు చేయవలసిన మొదటి పని డిజిలాకర్ అకౌంట్ కోసం సైన్ అప్ చేయడం. మీరు ఇప్పటికే సైన్ అప్ అయిఉంటే కనుక డాక్యుమెంట్లను పొందడం సులభం అవుతుంది.

** MyGov చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయడానికి మీరు 'నమస్తే' లేదా 'హాయ్' అని డిజిలాకర్ వాట్సాప్ నంబర్ +91 9013151515కు పంపాలి.

** మీరు ‘డిజిలాకర్'కి మెసేజ్ పంపిన వెంటనే "మీ డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి/ఇష్యూ చేయడానికి డిజిలాకర్ సేవలకు స్వాగతం" అని మీకు ప్రతిస్పందన వస్తుంది.

** తరువాత మీకు డిజిలాకర్ అకౌంట్ ఉందా అని అడుగుతారు. మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక వారి ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని వినియోగదారున్ని అడుగుతుంది. మీరు అలా చేసిన తర్వాత మీరు మీ నమోదిత మొబైల్ పరికరంలో OTPని పొందుతారు.

** మీరు OTPని నమోదు చేసిన తర్వాత మీరు మీ డిజిలాకర్ అకౌంటులో అందుబాటులో ఉన్న అన్ని డాక్యుమెంట్లు లేదా ఏదైనా ఎంపిక చేసిన ఒక డాక్యుమెంట్ ని డౌన్‌లోడ్ చేసుకోగలరు.

 

MyGov హెల్ప్‌డెస్క్

MyGov హెల్ప్‌డెస్క్ మార్చి 2020లో ప్రారంభించబడింది. వాట్సాప్‌లో వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుకింగ్‌లు మరియు వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌ల వంటి క్లిష్టమైన ఉపయోగాలతో పాటు కోవిడ్-సంబంధిత సమాచారం యొక్క యాక్సిస్ వనరులను ప్రజలకు అందించడం ద్వారా కోవిడ్-19 మహమ్మారిపై పోరాడడంలో కీలకమైన టూల్లను అందించింది. ఇప్పటివరకు 80 మిలియన్ల మంది ప్రజలు హెల్ప్‌డెస్క్‌కి చేరుకున్నారు. 33 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేయబడ్డాయి మరియు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అపాయింట్‌మెంట్‌లు కూడా బుక్ చేయబడ్డాయి. వాట్సాప్‌లోని MyGov చాట్‌బాట్, డిజిలాకర్ సేవలను జోడించడం ద్వారా పౌరులు వనరులు మరియు అవసరమైన సేవలను యాక్సెస్ చేయడానికి సమగ్ర అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సిస్టమ్‌ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

డిజిలాకర్‌లో

MyGov అధ్యక్షుడు & CEO NeGD, MD & CEO డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) అభిషేక్ సింగ్ ఈ డిజిలాకర్ సర్వీస్ ప్రారంభం గురించి వ్యాఖ్యానిస్తూ MyGov హెల్ప్‌డెస్క్‌లో డిజిలాకర్ సేవలను అందించడంతో సహజమైన పురోగతి మరియు వాట్సాప్ యొక్క సులభమైన మరియు యాక్సిస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అవసరమైన సేవలకు సులభమైన మరియు సరళీకృత యాక్సిస్ ను పౌరులకు అందించే దిశగా మొదటి అడుగు వేస్తున్నది. డిజిలాకర్‌లో ఇప్పటికే దాదాపు 100 మిలియన్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు మరియు ఇప్పటి వరకు 5 బిలియన్ల+ డాక్యుమెంట్‌లు జారీ చేయబడ్డాయి. వాట్సాప్‌లోని ఈ సర్వీస్ తో వారి ఫోన్‌లలోనే యాక్సిస్ డాక్యూమెంట్ల సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో లక్షలాది మందికి డిజిటల్‌గా సాధికారత ఇస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఇది ప్రజా సేవలను క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగుపరచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగా ఉంది.

Best Mobiles in India

English summary
How to Get PAN card, Driving License and More Government Documents Through Digilocker Service on WhatsApp?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X