Home
News

రిలయన్స్ జియో 4జీ SIMను పొందటం ఎలా..?

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ జియో 4జీ ఇంటర్నెట్ సర్వీసులు, దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరినాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఈ సేవలు పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లు రిలయన్స్ జియో 4జీ ఎక్స్‌పీరియన్స్‌ను ముందుగా పొందే అవకాశం ఉంటుంది.

  రిలయన్స్ జియో 4జీ SIMను పొందటం ఎలా..?

రిలయన్స్ గ్రూప్ సబ్సిడరీ బ్రాండ్ అయిన రిలియన్స్ జియో ఇన్ఫోకామ్ దేశవ్యాప్తంగా 4జీ ఎల్టీఈ సేవలను అందించేందుకు పాన్ - ఇండియా లైసెన్స్‌ను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు రిలయన్స్ జియో గత కొద్ది సంవత్సరాలుగా శ్రమిస్తోంది. ఈ వెంచర్‌లో భాగంగా దాదాపు 34,000 కోట్లను రిలయన్స్ వెచ్చించినట్లు సమాచారం.

Read More : ప్రమాదంలో Xiaomi ఫోన్‌లు? వెంటనే అప్‌డేట్ అవసరం

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డ్‌ను పొందడం ఎలా..?

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డ్‌ను పొందడం ఎలా..?

ప్రస్తుతానికి రిలయన్స్ జియో 4జీ సర్వీసులు లిమిటెడ్ ప్రివ్యూలోనే అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లు మాత్రమే జియో సిమ్ కార్డ్‌లను పొందగలుగుతున్నారు.

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డ్‌ను పొందడం ఎలా..?

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డ్‌ను పొందడం ఎలా..?

రిలయన్స్ లైఫ్ బ్రాండ్ ఫోన్‌లను కొనాలనుకునే యూజర్లు ముందుగా రిలియన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ jio.comలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతమైనట్లయితే జియో సర్వీసు నుంచి ఓ కోడ్ మీ ఈమెయిల్‌కు అందుతుంది.

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డ్‌ను పొందడం ఎలా..?

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డ్‌ను పొందడం ఎలా..?

ఈ కోడ్ ఆధారంగా మీకు జియో సిమ్‌తో పాటు లైఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అందించటం జరుగుతంది. రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతానికి రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ అలానే డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌లలో లభ్యమవుతున్నాయి.

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డ్‌ను పొందడం ఎలా..?

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డ్‌ను పొందడం ఎలా..?

ఒక్కో యూజర్‌కు రిలయన్స్ జియో జారీ చేసే కోడ్ ఇతరులకు బదిలీ చేయలేని విధంగా ఉంటుంది. ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధేశిత expiry dateతో వచ్చే ఈ కోడ్‌ ఆ గడువులోపే పనిచేస్తుంది.

Lyf బ్రాండ్ పేరిట

Lyf బ్రాండ్ పేరిట

Lyf బ్రాండ్ పేరిట రిలయన్స్ అందిస్తోన్న 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు రూ.2,999 ధర ట్యాగ్ నుంచి లభ్యమవుతున్నాయి.

3 నెలల సిమ్ కనెక్షన్ ఫ్రీ

3 నెలల సిమ్ కనెక్షన్ ఫ్రీ

ప్రతి ఫోన్ కొనుగోలు పై 3 నెలల రిలయన్స్ జియో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉచితంగా పొందే అవకాశాన్ని రిలయన్స్ కల్పిస్తోంది.

రిలయన్స్ జియో డౌన్‌లోడ్ స్పీడ్స్

రిలయన్స్ జియో డౌన్‌లోడ్ స్పీడ్స్

రిలయన్స్ జియో 4జీ సిమ్ అందించే డౌన్‌లోడ్ స్పీడ్ నెట్‌వర్క్ స్థాయిని బట్టి కనిష్టంగా 8 ఎంబీపీఎస్ నుంచి గరిష్టంగా 18 ఎంబీపీఎస్ వరకు ఉంది.

ఇతర నెట్‌వర్క్స్ డౌన్‌లోడ్ స్పీడ్స్

ఇతర నెట్‌వర్క్స్ డౌన్‌లోడ్ స్పీడ్స్

ఇదే సమయంలో మార్కెట్లోని ఇతర నెట్ వర్క్ ఆపరేటర్లు ఆఫర్ చేస్తోన్న 4జీ నెట్ వర్క్ స్పీడ్స్ 6 ఎంబీపీఎస్ నుంచి 10 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ స్పీడ్‌లను కలిగి ఉంటున్నాయి.

Best Mobiles in India

English summary
How to get Reliance Jio 4G SIM?. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X