మీ జీమెయిల్ తెలుగులో కనిపించాలంటే..?

Posted By: Prashanth

How to Get the Gmail Telugu version?

 

మీ జీమెయిల్ అకౌంట్ తెలుగులో కినిపించాలంటే... సెట్టింగ్స్‌లోని లాంగ్వేజ్ ఆఫ్సన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా తెలుగును ఎంపిక చేుసుకోవాలి. ఆ సెట్టింగ్స్‌ను సేవ్ చేసినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్‌లోని వివరాలు తెలుగు భాషలో దర్శనమిస్తాయి. తిరిగి ఇంగ్లీష్‌లోకి మార్చుకోవాలనిపిస్తే మరలా సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా ఇంగ్లీష్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ జీమెయిల్ అకౌంట్ వివరాలు తిరిగి ఆంగ్లంలోకి మారిపోతాయి.

విదేశీ భాషలోని మెయిల్‌ను సొంత భాషలోకి అనువాదం చేసుకోవచ్చా..?

విదేశీ భాషల్లో వచ్చిన ఈ మెయిళ్లను తమ సొంత భాషల్లోకి అనువాదం చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని జీ మెయిల్ తెలిపింది. త్వరలో కొత్తగా జీ మెయిల్‌లో ట్రాన్స్‌లేట్ మెసేజ్ హెడర్‌ను అందిస్తామని, ఈ సౌలభ్యంతో మెయిళ్లను సొంత భాషలోకి అనువాదం చేసుకోవచ్చని గూగుల్ ట్రాన్స్‌లేట్ ప్రోడక్ట్ మేనేజర్ జెఫ్ చిన్ చెప్పారు. ఆహ్వాన ప్రాతిపదికన, గుగూల్ జీమెయిల్ సర్వీసులను ప్రపంచవ్యాప్తంగా ఎప్రిల్ 1, 2004న ప్రారంభించింది. ఈ ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో జీమెయిల్ తన స్టోరేజ్ శాతాన్ని 1జీబి నుంచి 7.5జీబి వరకు క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. తాజాగా ఈ స్టోరేజ్ శాతాన్ని మరో 2.5జీబికి పొడిగిస్తూ, జీమెయిల్ టీమ్ ఓ ప్రకటనను జారీ చేసింది. అంటే జీమెయిల్‌లో లభ్యమయ్యే ఉచిత స్టోరేజ్ శాతం 10జీబి అన్నమాట. ఈ ఉచిత స్టోరేజ్ వెసలుబాటు జీమెయిల్ యూజర్లందరికి వర్తిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot