వాట్సాప్ పేమెంట్స్ యూజర్లకు రూ.105 వరకు క్యాష్‌బ్యాక్‌!! మిస్ అవ్వకండి...

|

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లో వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆన్‌లైన్‌ పద్దతిలో పేమెంట్స్ అధికమవుతున్న ఈ రోజులలో తన యొక్క ప్లాట్‌ఫారమ్‌కు ఆకట్టుకోవడానికి దేశంలో ఇటీవల ఎంపిక చేసిన వినియోగదారులకు రూ.105 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లో వినియోగదారులు కనీసం రూ.1 లావాదేవీ చేస్తే కనుక రూ.105 క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. అయితే ఈ క్యాష్‌బ్యాక్ రూ.35 లతో మూడు సార్లుగా అందిస్తుంది. వాట్సాప్ పేమెంట్స్ సేవలను ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులందరికి కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ యాప్‌లో నిర్దిష్ట బహుమతి చిహ్నం కనిపిస్తే మాత్రమే పేమెంట్స్ లెక్కించబడతాయి అని గుర్తుంచుకోండి. అయితే ప్రస్తుత ఈ క్యాష్‌బ్యాక్‌ను వాట్సాప్ బిజినెస్ యూజర్‌లు పొందలేరు.

 

వాట్సాప్ పేమెంట్స్

వాట్సాప్ సంస్థ తన యొక్క పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఏప్రిల్‌లో కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వాట్సాప్ పేమెంట్లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు మూడు బదిలీలలో రూ.33 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించింది. వాట్సాప్ రెగ్యులేటరీ ఆమోదం పొందిన కొద్దిసేపటికే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించబడింది. అర్హత కలిగిన వినియోగదారులు గతంలో క్యాష్‌బ్యాక్‌ రూపంలో రూ.11 పొందగా ఇప్పుడు వారి లావాదేవీ మీద రూ.35 లతో మొత్తంగా రూ.105 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఆధార్ కార్డ్ మీకు ఉందా? అన్ని రకాల సేవలను ఇంటివద్దనుండే యాక్సెస్ చేయవచ్చు..ఆధార్ కార్డ్ మీకు ఉందా? అన్ని రకాల సేవలను ఇంటివద్దనుండే యాక్సెస్ చేయవచ్చు..

క్యాష్‌బ్యాక్
 

వాట్సాప్ పేమెంట్ సేవలతో క్యాష్‌బ్యాక్ పొందాలనుకునే వినియోగదారుల కోసం కంపెనీ నిర్దిష్ట అర్హత ప్రమాణాలను నిర్దేశించింది. ఇందులో మొదటిది మీరు తప్పనిసరిగా కనీసం 30 రోజుల పాటు వాట్సాప్ ద్వారా పేమెంట్స్ చేసే వినియోగదారు అయి ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంటును జోడించడం ద్వారా యాప్‌లో పేమెంట్స్ కోసం నమోదు చేసుకోవాలి. వాట్సాప్ పేమెంట్లను ఉపయోగిస్తున్న గ్రహీతలకు డబ్బులను పంపినప్పుడు మాత్రమే క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. బహుమతి చిహ్నం కనిపించనప్పుడు (గ్రహీతల పేరు పక్కన) చేసిన పేమెంట్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హత ఉండదని మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ సర్వీస్ పేర్కొంది. QR కోడ్ పేమెంట్స్, అభ్యర్థనలపై పేమెంట్స్, గ్రహీత యొక్క UPI IDని నమోదు చేయడం ద్వారా చేసిన పేమెంట్లు మరియు మూడవ పార్టీ వినియోగదారులకు చేసే పేమెంట్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హత పొందవు.

Microsoft Internet explorer రిటైర్ అవుతుంది ! ఇక మీకు అందుబాటులో ఉండదు.Microsoft Internet explorer రిటైర్ అవుతుంది ! ఇక మీకు అందుబాటులో ఉండదు.

వాట్సాప్ పేమెంట్లపై రూ.105 క్యాష్‌బ్యాక్ పొందే విధానం

వాట్సాప్ పేమెంట్లపై రూ.105 క్యాష్‌బ్యాక్ పొందే విధానం

** గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.

** వాట్సాప్ ని ఓపెన్ చేసి మీ చాట్ జాబితా పైన గిఫ్ట్ ఐకాన్ తో కూడిన బ్యానర్ ఐకాన్ కోసం చూడండి.

** వాట్సాప్ పేమెంట్లను ఉపయోగించే కాంటాక్ట్ నెంబర్ ని ఎంచుకుని చాట్ బార్‌లో రూపాయి (₹) ఐకాన్ ఎంపిక మీద నొక్కండి.

** మీరు గ్రహీతకు పంపాలనుకుంటున్న మొత్తాన్ని (రూ.1 లేదా అంతకంటే ఎక్కువ) నమోదు చేసి 'సెండ్' బటన్‌ మీద నొక్కండి.

** తదుపరి స్క్రీన్‌లో మీ UPI పిన్‌ని నమోదు చేయండి.

** పేమెంట్ ట్రాన్సక్షన్ ని నిర్ధారించడానికి ఇన్-చాట్ కంఫర్మ్ మెసేజ్ కోసం చూడండి.

** మీరు క్యాష్‌బ్యాక్ అందుకున్నారని నిర్ధారిస్తూ మెసేజ్ కోసం WhatsApp పేమెంట్స్ విభాగాన్ని తనిఖీ చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Get WhatsApp Payments Rs.105 Cashback New Offer

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X