ఫైల్ లేదా ఫోల్డర్‌ను భద్రపరుచుకోవటం ఏలా..?

Posted By: Staff

ఫైల్ లేదా ఫోల్డర్‌ను భద్రపరుచుకోవటం ఏలా..?

డెస్క్‌టాప్ పై మీరు క్రియేట్ చేసిన ఫోల్డ్రర్‌లో ముఖ్యమైన సమాచారం దాగి ఉందా..?, ఆ ఫోల్డర్ ఎవరికి కనిపించకుండా భద్రపరుచుకోవచ్చా..?, మీరు సృష్టించిన ఫైల్ లేదా ఫోల్డర్ భద్రపరుచుకోవాలనుకుంటే, సదురు ఫైల్ లేదా ఫోల్డర్ పై మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ప్రోపర్టీస్ విండోలో హిడెన్(Hidden) అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసిన అప్లై (Apply)అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఈ చర్య ద్వారా మీరు దాచాలనుకన్న ఫైల్ లేదా ఫోల్డర్ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ జాబితాలోకి చేరిపోతుంది.

ఇలా దాచుకున్న ఫైల్‌ను తిరిగి చూసుకోవాలంటే స్టార్ట్ మెనూలోకి ప్రవేశించి కంట్రోల్ ప్యానల్ విభాగాన్ని ఓపెన్ చేసి ఫోల్డర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేయాలి. ఫోల్డర్ విండోలోని వ్యూ (view) ఐకాన్ పై క్లిక్ చేసి ‘షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసినట్లయితే హిడెన్ కాబడిన ఫైల్ లేదా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. మరలా ఆ ఫైల్ లేదా ఫోల్డర్‌ను హిడెన్ చేయాలనుకుంటే స్టార్ట్ మెనూలోకి ప్రవేశించి కంట్రోల్ ప్యానల్ విభాగాన్ని ఓపెన్ చేసి ఫోల్డర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఫోల్డర్ విండోలోని వ్యూ (view) ఐకాన్ పై క్లిక్ చేసి

‘డు నాట్ షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసినట్లయితే సంబంధిత ఫైల్ లేదా ఫోల్డర్ డెస్కటాప్ పై మాయమైపోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot