Home
News

కొత్తగా వచ్చిన ఆపిల్ iOS 26 ఏయే ఐఫోన్‌లకు సపోర్టు చేస్తుంది.. ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి..?

ఆపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ (Apple WWDC) 2025 లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న iOS 26 అప్‌డేట్‌ వచ్చేసింది. iOS 19 పేరుతో రావాల్సి ఉండగా.. సంవత్సరాలకు అనుగుణంగా ఈ పేరుతో తీసుకొచ్చారు. యూజర్లకు అప్‌డేట్స్‌ పైన స్పష్టత ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే iOS 26 కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. లిక్విడ్‌ గ్లాస్ అనే కొత్త విజువల్‌ డిజైన్‌తో లాంచ్‌ చేసింది.

iOS 26 :
2013 లో iOS 7 వెర్షన్‌ను ప్లాట్‌ డిజైన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మళ్లీ తాజాగా లిక్విడ్ గ్లాస్‌ డిజైన్‌తో iOS 26 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో లిక్విడ్ గ్లాస్‌ డిజైన్ కారణంగా ఇంటర్‌ఫేస్‌లో అనేక మార్పులను చూడవచ్చు. కెమెరా యాప్‌, టైపింగ్‌ ఇండికేటర్‌, మెనూ, యాప్‌ ఐకాన్స్, విడ్జెట్స్‌ వంటి మార్పులు చూడవచ్చు.

iOS 26 supported devices lis

ఆకట్టుకొనేలా :
కలర్స్‌ రిఫ్లెక్ట్‌ ద్వారా డిస్‌ప్లే మరింత ఆకట్టుకొనేలా ఉంటుందని తెలుస్తోంది. మ్యూజిక్‌ సమయంలో యానిమేషన్‌ ఎఫెక్ట్‌, లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌, రైటింగ్‌ టూల్స్‌, ఇమేజ్‌ ప్లేగ్రౌండ్‌, హోమ్‌, లాక్‌ స్క్రీన్‌ కస్టమైజేషన్‌ వంటి అనేక మార్పులను చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న అన్ని ఐఫోన్‌లు ఈ కొత్త అప్‌డేట్‌ను సపోర్టు చేయవని యూజర్లు గుర్తుంచుకోవాలి.

ఆపిల్ iOS 26 అప్‌డేట్‌ వెర్షన్‌ను ఆపిల్‌ 11 తర్వాత వచ్చిన కొత్త మోడల్స్‌ మాత్రమే సపోర్టు చేస్తాయి. అయితే ఏయే మోడల్స్ ఈ కొత్త OS ను సపోర్టు చేస్తాయి. ఈ OS ను ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. iOS 26 ను సపోర్టు చేసే ఐఫోన్‌ల జాబితా మీ కోసం.

- ఐఫోన్‌ 16
- ఐఫోన్ 16
- ఐఫోన్‌ 16 ప్రో
- ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌
- ఐఫోన్‌ 16e
- ఐఫోన్ 15
- ఐఫోన్‌ 15 ప్లస్‌
- ఐఫోన్ 15 ప్రో
- ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్
- ఐఫోన్‌ 14
- ఐఫోన్‌ 14 ప్లస్
- ఐఫోన్‌ 14 ప్రో
- ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌
- ఐఫోన్‌ 13
- ఐఫోన్‌ 13 మినీ
- ఐఫోన్‌ 13 ప్రో
- ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌
- ఐఫోన్‌ 12
- ఐఫోన్‌ 12 మినీ
- ఐఫోన్‌ 12 ప్రో
- ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌
- ఐఫోన్‌ 11
- ఐఫోన్‌ 11 ప్రో
- ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌
- ఐఫోన్‌ SE 2020
- ఐఫోన్ SE 2022
- ఐఫోన్‌ 17 మోడల్స్‌ iOS 26 వెర్షన్‌తో లాంచ్‌ కానున్నాయి.

ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి iOS 26 అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే అంతకంటే ముందుగానే బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసి, వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఆపిల్ డెవలపర్‌ ప్రొగ్రామ్‌లో జాయిన్‌ కావాల్సి ఉంటుంది. ఆపిల్ ID లాగిన్‌తో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Take a Poll

ఇందులో రిజిస్టర్‌ చేసుకున్నాక ఐఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం జనరల్ > సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ > బీటా అప్‌డేట్‌ > iOS 26 డెవలపర్‌ బీటా పైన క్లిక్‌ చేయాలి. అయితే ఇది పూర్తి స్థాయి వెర్షన్‌ కాదని యూజర్లు గుర్తుంచుకోవాలి.

Best Mobiles in India

English summary
How to Install iOS 26 in your iPhone and here is supported devices list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X