Home
News

ఇంట్లో దోమలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ పరికరాన్ని ప్రయత్నించండి

వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇళ్లు సహా పరిసరాల్లో దోమలు సందడి ఎక్కువవుతుంది. దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ దోమలు కారణంగా కొందరు నిద్రలేమికి గురవుతారు. మరియు చాలా మంది రోగాలు. జ్వరాల బారిన పడతారు. దోమల కారణంగా చిన్నారులు అధికంగా అవస్థలు పడతారు.

దోమల నివారణకు మనం ఇంట్లో బ్యాట్‌లు, కాయిల్‌, దోమ తెరలు వినియోగిస్తుంటాం. వీటి వలన ప్రయోజనాలు ఉన్నా.. పూర్తి స్థాయిలో దోమలను నివారించలేవు. దోమల నియంత్రణకు మార్కెట్లో చాలా పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

mosquitoes killer

చాలా మంది ఇళ్లలో దోమల బ్యాట్‌లు ఉంటాయి. కానీ వాటి నుంచి వచ్చే పొగ, వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ మస్కిటో కిల్లర్‌ పరికరం ద్వారా పర్యావరణానికి మరియు ఇంట్లో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దోమలు, ఇతర కీటకాలను నివారించవచ్చు.

ఈ మస్కిటో కిల్లర్ పరికరం నుంచి దోమలు తప్పించుకోవడం చాలా కష్టం. ఈ పరికరానికి ఉండే లైట్ వద్దకు వచ్చే దోమలు వెంటనే చనిపోతాయి. అయితే దోమలను చంపేందుకు ఎటువంటి లిక్విడ్‌, క్వాయిల్‌ వినియోగించదు. ఫలితంగా దోమలు చనిపోయిన సమయంలో ఎటువంటి చెడు వాసన రాదు.

ఎలా పనిచేస్తుంది: ఓ పరికరం ఇంట్లో దోమలు అధికంగా ఉన్న చోట ఏర్పాటుచేయవచ్చు. ఈ పరికరానికి ఎల్‌ఈడీ లైట్‌ ఉంటుంది. దోమలు ఈ యంత్రం వద్దకు వచ్చినప్పుడు UV ( అతినీలలోహిత) కిరణాల కారణంగా దోమలు చనిపోతాయి. అనంతరం సమయం ఉన్నప్పుడు యంత్రం మూత తొలగించి చనిపోయిన దోమలను బయటకు తీయవచ్చు.

mosquitoes killer

ఈ పరికరం పోల్టబుల్‌గా వస్తుంది. ఫలితంగా నచ్చిన చోటుకు సులభంగా తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ పరికరం ఇంటి లోపల ప్రాంతాల్లో మాత్రమే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. ఇందుకు విద్యుత్ కనెక్షన్‌ అవసరం. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నారులు రోగాల బారిన పడకుండా ఈ పరికరం ఉపయోగపడుతుంది.

ధర, లభ్యత : ఈ పరికరం ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. 20W ఎలక్ట్రిక్‌ ఇన్‌సెక్ట్‌ కిల్లర్‌ మెషిన్‌ ప్రత్యేక ఆఫర్ కింద రూ.2,849, అమెజాన్‌లో Vozica కిల్లర్‌ మెషిన్‌ ధర రూ. 1699గా ఉంది. Coroid ఎలక్ట్రిక్‌ ఎల్‌ఈడీ ధర రూ.1699గా ఉంది.

ఈ పరికరాలు రీఛార్జ్‌ చేయగల బ్యాటరీ ఆప్షన్‌తోనూ అందుబాటులో ఉన్నాయి. మన ఇంటికి ఎన్ని వోల్టేజ్‌ అవసరమో చూసుకొని కొనుగోలు చేయవచ్చు. ఈ పరికరం ద్వారా ప్రభావంతమైన స్థాయిలో దోమలు, ఇతర కీటకాలను నాశనం చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to kill mosquitoes with this machine in home specs and price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X