SIM Cards : మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా తెలుసుకోండి..!
ఫోన్ నంబర్‌ల ఆధారంగా అనేక అనేక నేరాలు జరుగుతున్నాయి. నకిలీ సిమ్ కార్డులు (SIM Cards) సహా ఇతర మార్గాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వాల స్థాయిలో నకిలీ సిమ్ కార్డుల కట్టడి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే వ్యక్తిగతంగానూ సిమ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుతం ఫోన్ నంబర్లను ఆధార్ తో లింక్ కోసం ఉపయోగిస్తున్నారు. ఆధార్ వివరాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. బ్యాంకులు సహా ఇతర సంస్థలు కూడా ఆధార్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఆధార్ కార్డుతో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకొనేందుకు అవకాశం ఉంది.

దీంతోపాటు సంచార్ సాథీ వెబ్‌సైట్ ద్వారాను మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ ద్వారాను ఈ అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకరి పేరు మీద గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు తీసుకొనేందుకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంటే, చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది.
నేరగాళ్లు నకిలీ సిమ్ కార్డులు ఉపయోగించే నేరాలకు పాల్పడుతున్నారు. మీ పేరు మీద కూడా మీకు తెలియకుండా సిమ్ కార్డులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే అప్రమత్తంగా వ్యవహరించడం ఉత్తమం.
నెట్‌వర్క్ ప్రొవైడర్ వెబ్‌సైట్ ఆధారంగా :
> ముందుగా ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా (Vi), BSNL వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.
> అనంతరం Verify Number లేదా ఆధార్ లింక్ పైన క్లిక్ చేయాలి.
> అక్కడ ఆధార్ వివరాలను నమోదు చేయాలి.
> ఆధార్ నంబర్ తో లింక్ చేసిన మొబైల్ నంబర్ కు వచ్చే OTP ను అక్కడ నమోదు చేయాలి.
> అనంతరం మీ పేరు మీద ఉన్న యాక్టివ్ నంబర్ల వివరాలు అక్కడ కనిపిస్తాయి.
> అందులో మీకు సంబంధం లేని ఫోన్ నంబర్లు ఉంటే, నెట్‌వర్క్ ప్రొవైడర్ ను సంప్రదించి డియాక్టివేట్ చేసుకోవాలి.
సంచార్ సాథీ వెబ్‌సైట్ ఆధారంగా :
> సంచార్ సాథీ వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.
> అనంతరం వెబ్‌సైట్ లోని Citizen Centric Services పై క్లిక్ చేయాలి.
> అక్కడ కనిపించే Know Your Mobile Connections పైన క్లిక్ చేయాలి.
> మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ను నమోదు చేసి, ఆ నంబర్‌కు వచ్చిన OTP ను ఎంటర్ చేయాలి.
> అనంతరం మీకు సంబంధించిన నంబర్లు అక్కడ కనిపిస్తాయి.
> అందులో మీకు సంబంధం లేని నంబర్లు ఉండే, వెబ్‌సైట్ లోనే ఫిర్యాదు చేసి, డియాక్టివేట్ చేయవచ్చు.
USSD కోడ్ ఆధారంగా :
> మీ మొబైల్ నుంచి *121# పైన క్లిక్ చేయాలి.
> అనంతరం అక్కడ కొన్ని ఆప్షన్‌లు కనిపిస్తాయి.
> అందులో Check The linked Mobile Numbers పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
> మీకు సంబందం లేని నంబర్లపై నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.


Click it and Unblock the Notifications



