రేషన్ కార్డుల eKYC చేయించారా.. మీ పేరు పెండింగ్ జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..?
రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇదే ప్రాతిపదికన ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ కార్డుల eKYC ప్రక్రియ ప్రారంభం అయింది. డీలర్‌ల వద్ద పెండింగ్ జాబితాలోని లబ్ధిదారులు eKYC పూర్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
ఈ-పోస్ యంత్రాల ద్వారా KYC :
ప్రస్తుతం ఏపీలో రేషన్ కార్డుల eKYC లను ఈ-పోస్ యంత్రాల ద్వారా బయోమెట్రిక్ విధానంలో పూర్తి చేస్తున్నారు. పెండింగ్ జాబితాలోని లబ్ధిదారులకు ఫోన్ చేసిన సమాచారం అందిస్తున్నారు. అందుబాటులో ఉన్న లబ్ధిదారులు రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రాల ద్వారా eKYC ను పూర్తి చేస్తున్నారు.

ఇందుకు మీ రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలి. అందులో మీ పేరు పెండింగ్ జాబితాలో ఉంటే ఏప్రిల్ 30 వ తేదీ లోగా eKYC ను పూర్తి చేయాల్సి ఉంటుంది. పెండింగ్ జాబితాలో ఉండే ఈ-పోస్ యంత్రంలో రెడ్ రంగుల్లో మీ పేరు కనిపిస్తుంది. బయోమెట్రిక్ ద్వారా KYC ను పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తయ్యాక మీ పేరు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది.
ఆన్‌లైన్‌లో :
అయితే ఆన్‌లైన్ విధానంలోనూ మీరు రేషన్ కార్డు eKYC పెండింగ్ జాబితాలో ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు. https://epds1.ap.gov.in/epdsAP/epds పైన క్లిక్ చేయాలి. అనంతరం డ్యాష్ బోర్డ్ పైన ట్యాప్ చేయాలి. అనంతరం రేషన్ కార్డు అనే ఆప్షన్ కనిపిస్తుంది.
రేషన్ కార్డు నంబర్ అందించిన అనంతరం పెండింగ్ జాబితా వివరాలు కనిపిస్తాయి. అయితే eKYC మాత్రం రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం వద్ద మాత్రమే చేయించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు ఇందుకు అవకాశం ఉంది.
ఈ సంవత్సరం మే నెల నుంచి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులు జతచేయడం మరియు తొలగించడం ఇతర ఆప్షన్ లకు అవకాశం ఇస్తామని చెప్పారు. కొత్త కార్డులు ATM కార్డు సైజులో క్యూఆర్ కోడ్ ఆప్షన్‌తో అందిస్తామని చెప్పారు.
రేషన్ కార్డులను సరికొత్తగా అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. eKYC పూర్తి చేశాక కొత్త కార్డుల జారీ సహా ఇతర వివరాలు తెలియనున్నాయని తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు సహా కొత్తగా కార్డుల జారీపై మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 5 సంవత్సరాల కు ఒకసారి రేషన్ కార్డులోని వివరాలను అప్ డేట్ చేసుకోవాలి. దీంతోపాటు ప్రస్తుతం 5 సంవత్సరాల కంటే తక్కువ మరియు 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న లబ్దిదారులు రేషన్ కార్డుల eKYC పూర్తి చేయించాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications








