టిక్‌టాక్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?

By Gizbot Bureau
|

యువతను కట్టిపడేస్తున్న 'టిక్‌టాక్‌’ యాప్‌కు రోజురోజుకి ఆదరణ పెరిగిపోతోంది. ఫొన్‌లో ఈ యాప్‌ ఉందంటే చాలు.. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎక్కువ సేపు టిక్‌టాక్‌ వీడియోలను చూస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వారికి టిక్‌టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీని మోజులో పడిన కొందరు యువకులు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు.

టిక్‌టాక్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?

 

అయినప్పటికీ దీనిమీద క్రేజ్ తగ్గడం లేదు. అయితే ఇంతలా పాపులర్ అయిన ఈ యాప్ ద్వారా డబ్బు ఎలా సంపాదించుకోవచ్చనే విషయం మీద చాలామంది ఆలోచన చేస్తుంటారు. అసలు అలాంటి అవకాశం ఉందా అని సెర్చ్ చేస్తుంటారు. అయితే నిజంగానే అలాంటి అవకాశం ఉందని తెలిస్తే చాలా సంబరపడతారు కూడా. అలాంటివి ఏమైనా ఉన్నాయోమో చూద్దాం.

 INFLUENCER

INFLUENCER

మీకు ఎక్కువ మంది followers ఉంటే మీరు ఇతర కంపెనీల రివ్యూలు రాస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. వాటిని ప్రమోట్ చేయడం ద్వారా దాన్ని వీలైనంత ఎక్కువమందికి చేరుస్తారు కాబట్టి కంపెనీలు మీకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. చాలా రకాల కంపెనీలు ఇప్పుడు ఇలాంటి వాటిని ఆఫర్ చేస్తున్నాయి. ఎంతోమంది INFLUENCERగా మారి చేతినిండా సంపాదిస్తున్నారు.

LIVE STREAMING

LIVE STREAMING

మీరు మ్యూజిక్ ప్రియులు అయితే కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే ఇందులో మీరు చాలామంది ఫాలోవర్స్ ని కలిగి ఉండాలి. ఎక్కడైనా మ్యూజికల్ నైట్ జరుగుతుంటే దాన్ని మీ వాల్ లై లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం ద్వారా నిర్వాహకులు మీకు కొంత మొత్తాన్ని అందిస్తారు. వారికి ఈ ఈవెంట్ పాపులర్ అవ్వడమే కావాలి కాబట్టి తప్పకుండా మీకు ఈ అవకాశం ఉంటుంది.

 PROMOTING / SELLING YOUR OWN VENTURES
 

PROMOTING / SELLING YOUR OWN VENTURES

మీ సొంత వ్యాపారాలు, అలాగే వెంచర్స్ ఏమైనా ఉంటే వాటిని మీ వాల్ లో ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీరు కొంత మొత్తాన్ని ఆర్జించవచ్చు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చాలా బాగా పాపులర్ అవుతోంది. తమ వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవాడానికి చాలామందికి ఇదొక చక్కటి వేదికగా మారింది.

టిక్‌టాక్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే

టిక్‌టాక్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే

మీరు టిక్‌టాక్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే మీకు చాలామంది ఫాలోవర్స్ ని పెంచుకోవాలి. ఎంత ఎక్కువమంది ఫాలోవర్స్ ఉంటే మీకు అంత ఆదాయం వస్తుంది. కాబట్టి మీరు ముందుగా ఎక్కువగా ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ తరువాత మీరు బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How To Make Money on TikTok

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X