Samsung ఫోన్‌లోని కెమెరా యాప్ ద్వారా UPI QR డిజిటల్ పేమెంట్స్ చేయడం ఎలా??

|

Samsung స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న ఎంపిక చేసిన వినియోగదారులు ఇప్పుడు స్థానిక కెమెరా యాప్ నుండి నేరుగా UPI QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయగలరని Samsung సంస్థ ప్రకటించింది. అదనంగా వినియోగదారులు ఫోన్‌లోని క్విక్ ప్యానెల్ నుండి కొత్తగా స్కాన్ QR ఎంపికను కూడా కలిగి ఉంటారు. కంపెనీ ప్రకారం ఈ స్కాన్ QR కోడ్ ఫీచర్ ఇప్పుడు Samsung Pay అనుకూల పరికరాలలో అందుబాటులో ఉంది.

How To Make UPI QR Digital Payments Through Camera App On Samsung Phones

Samsung ఫోన్‌లలోని కెమెరా యాప్ నుండి UPI QR కోడ్‌లను స్కాన్ చేసే విధానం

స్టెప్ 1: మొదటగా మీ Samsung స్మార్ట్‌ఫోన్‌లో తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉందని నిర్ధారించుకోండి.

స్టెప్ 2: కెమెరా యాప్‌కి వెళ్లి UPI QR కోడ్‌ని స్కాన్ చేయండి.

స్టెప్ 3: "శామ్సంగ్ పే " మరియు "Samsung Pay Mini" నుండి ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేయండి మరియు మీ UPI పిన్‌ను నమోదు చేయడం ద్వారా పేమెంట్ ను పూర్తి చేయండి.

QR స్కాన్ ఎంపికను ఉపయోగించడానికి మీరు చేయాల్సిందల్లా కెమెరా ఇంటర్‌ఫేస్‌ను ఓపెన్ చేసి నోటిఫికేషన్ బార్‌లోని "స్కాన్ QR కోడ్" ఎంపికపై నొక్కండి. ఇప్పుడు కెమెరాను QR కోడ్ వైపు మళ్లించి సూచనల ప్రకారం కొనసాగండి.

How To Make UPI QR Digital Payments Through Camera App On Samsung Phones

శామ్సంగ్ సంస్థ యొక్క శామ్సంగ్ గెలాక్సీ పరికరాల ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసినప్పుడు ప్రత్యేకమైన & వినూత్నమైన అనుభవాలను అందించడం ద్వారా వినియోగదారులకు రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడమే మా లక్ష్యం అని శామ్సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ సంజయ్ రజ్దాన్ ఒక ప్రకటనలో తెలిపారు. Samsung Pay ప్రారంభించినప్పటి నుండి UPI, Wallets, Gift కార్డ్‌లు, Fastag రీఛార్జ్ మరియు బిల్ పేమెంట్స్ వంటి వినియోగదారు-కేంద్రీకృత ఫీచర్‌లను నిరంతరం ఆవిష్కరిస్తున్నాము మరియు జోడించాము. కెమెరా మరియు త్వరిత ప్యానెల్‌ని ఉపయోగిస్తున్నప్పుడు పేమెంట్స్ చేయడానికి మా వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందించడం ద్వారా డిజిటల్ చెల్లింపులో మా పాదముద్రను విస్తరించడానికి మేము సంతోషిస్తున్నాము అని కూడా తెలిపారు.

How To Make UPI QR Digital Payments Through Camera App On Samsung Phones

గెలాక్సీ Z సిరీస్, గెలాక్సీ S21 సిరీస్, గెలాక్సీ S20 సిరీస్, గెలాక్సీ నోట్20 సిరీస్, గెలాక్సీ నోట్10 సిరీస్, గెలాక్సీ M సిరీస్, గెలాక్సీ A సిరీస్ మరియు గెలాక్సీ F సిరీస్‌లలో ఇప్పుడు QR స్కాన్ ఫీచర్ అందుబాటులో ఉందని Samsung సంస్థ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
How To Make UPI QR Digital Payments Through Camera App On Samsung Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X