Home
News

మీ కంప్యూటర్ ఆరోగ్యంగా ఉండాలంటే..?

By Super
 How to make your computer healthy


మీ పీసీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటేనే, మీ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. మీ పీసీలో యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేసి స్కాన్ చేసుకున్నట్టే మీ పీసీలో హార్డ్‌వేర్ భాగాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? కూడా చేక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. చెక్ చేయడం చాలా సులభం. కంట్రోల్ ప్యానెల్‌లో డివైస్ మేనేజర్‌ను ఎంచుకుని అందులో సిస్టమ్‌నీ, దానిలో హార్డ్‌వేర్‌ని ఎంచుకుని దేనిలో సమస్యలున్నయా? అని చెక్ చేసుకోవచ్చు. దీనికన్నా సులభంగా పని ముగించుకోవాలంటే start menu-run డైలాగ్ బాక్స్‌లో winmsd అని టైప్ చేసి ఎంటర్‌కీ ప్రెస్ చేయండి. ఇక హార్డ్‌వేర్ పరిస్థితిని విరవించే రిపోర్టు రెడీగా కనిపిస్తుంది.

మీ కంప్యూటర్ వేగంగా పనిచేయాలంటే..?

అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి:

ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:

పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.

రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి:

మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:

పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది.

అప్‌‍డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి:

విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X