Google Pay ద్వారా తెలంగాణ కరెంటు బిల్లును పే చేయడం ఎలా?

|

ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు కోట్లాది మంది ప్రజలు ఉపయోగించే యుపిఐ యాప్‌లో గూగుల్ పే ఒకటి. ఇందులో ప్రస్తుతం విద్యుత్ బిల్లుతో పాటు, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, గ్యాస్, వాటర్ బిల్ వంటి మరెన్నో బిల్లులను నెల వారిగా చెల్లించడానికి అవకాశం ఉంది. గూగుల్ పే యాప్ ద్వారా మీ ఇంటి యొక్క విద్యుత్ బిల్లును తనిఖీ చేయడం మరియు చెల్లించడం ఇప్పుడు చాలా సులభం అయింది. ప్రతి నెల విద్యుత్ బిల్లును సులభమైన పద్దతిలో చెల్లించడానికి ఉపయోగించే ప్రక్రియను తెలుసుకోవడానికి చివరి వరకు చదవండి.

TSSPDCL సర్వీస్ ప్రొవైడర్

TSSPDCL సర్వీస్ ప్రొవైడర్

ప్రస్తుతం దాదాపు అన్ని విద్యుత్ పంపిణీదారులు గూగుల్ పే బిల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నారు. కొన్ని రాష్ట్రాల పంపిణీదారులు తమ వ్యవస్థను భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థతో అనుసంధానించారు. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) ఇప్పటికి గూగుల్ పే బిల్ పేమెంట్ సౌకర్యంలో అందుబాటులో లేదు. TSSPDCL విద్యుత్ పంపిణీ సంస్థ హైదరాబాద్‌కు సేవలు అందిస్తుంది. అయితే TSSPDCL యొక్క వినియోగదారులు ఆన్‌లైన్ బిల్లు పేమెంట్ కోసం Paytm లేదా Freecharge ని ఉపయోగించవచ్చు.

 

Also Read: Oppo నుంచి ఆశ్చర్యకరమైన ఫీచర్లతో కొత్త AR ఉత్పత్తులు....Also Read: Oppo నుంచి ఆశ్చర్యకరమైన ఫీచర్లతో కొత్త AR ఉత్పత్తులు....

Google Pay లో తెలంగాణ కరెంటు బిల్ పే చేసే విధానం

Google Pay లో తెలంగాణ కరెంటు బిల్ పే చేసే విధానం

గూగుల్ పేలో ప్రస్తుతం తెలంగాణ కరెంటు బిల్లులను చెల్లించడానికి అనుమతించే తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) వ్యవస్థ అందుబాటులో లేనందున గూగుల్ పే ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించడానికి మొదట ఆన్‌లైన్ లో TSSPDCL వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి. ఇందులో మీరు పే యువర్ బిల్ > బిల్ డెస్క్ > పద్దతులను పాటించి కరెంటు బిల్ పే చేయవచ్చు. తరువాత మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తరువాత మీరు చెల్లించవలసిన బిల్ మొత్తం చూపబడుతుంది. ఇందులో 'పే' ఎంపిక మీద క్లిక్ చేసిన తరువాత పేమెంట్ చేయడానికి మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో QR కోడ్ ఎంపిక మీద క్లిక్ చేయండి. తరువాత ట్యాబ్ లో QR కోడ్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీ యొక్క గూగుల్ పేను ఓపెన్ చేసి అందులో 'న్యూ పేమెంట్' > బిల్ పేమెంట్> స్కాన్ ఎంపిక మీద క్లిక్ చేసి ఈ QR కోడ్ ను స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు.

 

Also Read: Tata Sky సెట్-టాప్ బాక్స్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్స్!! కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి....Also Read: Tata Sky సెట్-టాప్ బాక్స్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్స్!! కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి....

Google Pay ద్వారా కరెంటు బిల్లు చెల్లించడం ఎలా?

Google Pay ద్వారా కరెంటు బిల్లు చెల్లించడం ఎలా?

1- మీ యొక్క పాస్‌వర్డ్ ఉపయోగించి మీ Google Pay యాప్ ను ఓపెన్ చేయండి.

2- ‘న్యూ పేమెంట్' బటన్‌పై నొక్కండి. ఇప్పుడు ‘బిల్ పేమెంట్' ఎంపికను ఎంచుకోండి. ఇందులో విద్యుత్ బిల్లును ఎంచుకోండి.

3- మీ రాష్ట్రం యొక్క విద్యుత్ పంపిణీదారుని ఎంచుకోండి. తెలంగాణకు TSSPDCL ఉత్తమమైనది. అయితే ప్రస్తుతం ఇందులో అనుసంధానించలేదు.

4- మీ సర్వీస్ నెంబర్ ను నమోదు చేయండి. మీ యొక్క విద్యుత్ బిల్లు నుండి మీరు ఈ నెంబర్ ను కనుగొనవచ్చు.

5- మీ సర్వీస్ నెంబర్ ఆధారంగా గూగుల్ పే బిల్ పేమెంట్ వ్యవస్థ బకాయి మొత్తాన్ని పొందుతుంది.

6- బకాయి మొత్తాన్ని చెల్లించడానికి ‘పే' బటన్ మీద నొక్కండి.

7- పేమెంట్ విధానం యుపిఐ కి మాత్రమే. చూపిన బ్యాంక్ అకౌంటును గమనించండి.

8- ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క యుపిఐ పిన్ను నమోదు చేయండి.

9- మీరు సరైన యుపిఐ పిన్ ఎంటర్ చేసినప్పుడు పేమెంట్ జరుగుతుంది.

10- ఇది ఆన్‌లైన్ పేమెంట్ విద్యుత్ బిల్లు యొక్క మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తుంది.

 

గూగుల్ పే విద్యుత్ బిల్లు ఎంపికలలో గమనికలు

గూగుల్ పే విద్యుత్ బిల్లు ఎంపికలలో గమనికలు

*** మీరు విద్యుత్ బిల్లును చెల్లించిన తర్వాత గూగుల్ పే ప్రతి నెల బిల్ చేసిన మొత్తాన్ని ఆటొమ్యాటిక్ గా పొందుతుంది. కాబట్టి మీరు ప్రతి నెల పై దశలను అనుసరించవలసిన అవసరం ఉండదు. కావున అత్యుత్తమ విద్యుత్ బిల్లు ఎంపికలను పొందవచ్చు. మీరు కోరుకుంటే మీ పేమెంట్ కోసం ఇతర యుపిఐ అనువర్తనాలను కూడా ఉపయోగించవచ్చు.


*** మీరు ఇతర పేమెంట్ పద్ధతి ద్వారా విద్యుత్ బిల్లును చెల్లిస్తే కనుక అది ఇక్కడ Google Pay యాప్ లో ప్రతిబింబించదు. ఇది బకాయి మొత్తంగా చూపిస్తుంది.

 

Best Mobiles in India

English summary
How to Pay Telangana Electricity Bill in Google Pay

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X