మంచి ఏసీ కోసం చూస్తున్నారా, మీకోసమే ఈ పూర్తి సమాచారం
ఎండాకాలం వచ్చేసింది. వాతావరణం హాట్ హాట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్ ఉన్నా కాని వేడి తగ్గదు. అలాంటి వారు ఏసీక కొనాలని అనుకుంటారు. మరి మార్కెట్లో అనేక రకాల కంపెనీల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాట
ఎండాకాలం వచ్చేసింది. వాతావరణం హాట్ హాట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్ ఉన్నా కాని వేడి తగ్గదు. అలాంటి వారు ఏసీక కొనాలని అనుకుంటారు. మరి మార్కెట్లో అనేక రకాల కంపెనీల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్ అనే విషయం చాలామందికి తెలియదు. మంచి ఏసీని ఎలా సెలక్ట్ చేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.

సైజు ఎంత ఉండాలి అందులో ఫీచర్లు ఏంటి, అలాగే వారంటి గ్యారంటి లాంటి విషయాల మీద కసరత్తు చేస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ఏసీ కొనాలనుకునే వారికి కొన్ని రకాల ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

కెపాసిటి
మీ రూమ్ సైజు 100-120 sq ft ఉంటే మీకు 1 టన్ను కెపాసిటీ గల ఏసీ సరిపోతుంది. అంతకన్నా పెద్ద రూములు అయితే 1. 5 టన్ను కాని అలాగే 2 టన్నుల కెపాసిటీ ఉన్న ఏసీ సరిపోతుంది. సెలక్ట్ చేసుకునే సమయంలో ఇది చాలా ముఖ్యంగా ఉండాలి

రూము ఎలా ఉండాలి
మీరు రూములో లేక హాలులో ఏసీ పెట్టుకోవాలనుకుంటే దానికనుగుణంగా మీరు ఏసీని సెలక్ట్ చేసుకోవాలి. సూర్యుడు ఎక్కువగా ఉన్న ప్రదేశం అయితే హైయ్యర్ కెపాసిటీ ఉన్న ఏసీని సెలక్ట్ చేసుకోవాలి. లేకుంటే మాములు ఏసీ సరిపోతుంది.

రెండు రకాల ఏసీలు
మీరు ఏసీ కొనుగోలు చేయాలనుకున్నట్లయితే అందులో రెండు రకాల ఏసీలు ఉంటాయి. వాటిల్లో ఒకటి Window AC రెండవది Split AC.Window AC అయితే మీ రూము కలర్స్ కి అనుగుణంగా సెలక్ట్ చేసుకోవాలి. అలాగే Split AC అయితే రెండు పార్టుల్లో ఉంటుంది. blower and compressorల్లో ఇది మీకు లభిస్తుంది. ఇందులో compressor రూము బయట ఉంటుంది. blower రూములోపల ఉంటుంది. రెండు కూడా చాలా కూలింగ్ ను ఇస్తాయి.

రూమ్ సైజు కెపాసిటీ
120 అడుగులు కన్నా తక్కువ అయితే 1.2 టన్ కెపాసిటీ గల ఏసీ
120 నుంచి 170 అడుగుల మధ్య అయితే 1.5 టన్ ఏసీ
180 అడుగులు పైన అయితే 2 టన్ కెపాసిటీ


Click it and Unblock the Notifications








