Home
News

వైఫై రూటర్ ద్వారా మల్టిపుల్ గేమ్స్ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం ఎలా ?

లాన్ గేమింగ్ అంటే చాలామందికి చాలా ఆసక్తి ఉంటుంది.కాలేజిల్లోని హాస్టల్లో ఉండే స్టూడెంట్లు అలాగే బయట హాస్టల్లో ఉండే మిత్రులు అందరూ గేమ్స్ ని ఆడేందుకు చాలా ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఈ మధయ ఆన్ లైన్ గేమి

లాన్ గేమింగ్ అంటే చాలామందికి చాలా ఆసక్తి ఉంటుంది.కాలేజిల్లోని హాస్టల్లో ఉండే స్టూడెంట్లు అలాగే బయట హాస్టల్లో ఉండే మిత్రులు అందరూ గేమ్స్ ని ఆడేందుకు చాలా ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఈ మధయ ఆన్ లైన్ గేమింగ్ వచ్చినప్పటి నుంచి గేమింగ్ లో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా PUBG and Fortnite గేమ్స్ వచ్చిన తరువాత ఈ బాటిల్ గేమ్స్ యూజర్లను విపరీతంగా కట్టిపడేస్తున్నాయి.

వైఫై రూటర్ ద్వారా మల్టిపుల్ గేమ్స్ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం ఎలా ?

అయితే ఈ గేమ్స్ అన్నీ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం ద్వారా తేలికగా ఆడుకునే అవకాశం ఉంది. వైర్ లైస్ నెట్ వర్క్ ద్వారా కాని ad hoc networkతో సీక్రెట్ కీ ఉపయోగించడం ద్వారా కాని దీన్ని ఆడుకోవచ్చు. అలాగే కొన్ని సార్లు కీవర్డ్ లేకుండానే ఆడుకోవచ్చు. అయితే విండోస్లో డైరక్ట్ గా ad hoc creating option లేదు. ఉన్నా కొన్ని సార్లు అది ప్రాపర్ గా పనిచేయకపోవచ్చు. ఈ శీర్షికలో భాగంగా విండోస్ 10తో రెండు ల్యాపీలను ఉపయోగించి మరిన్ని గేమ్స్ ఫ్రెండ్స్ తో ఎలా ఆడుకోవాలో చూద్దాం. అయితే ఇది ఆన్ లైన్ గేమింగ్ కాదు.

వైఫై రూటర్ ద్వారా మల్టిపుల్ గేమ్స్ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం ఎలా ?

విండోస్ 10కి అలాగే విండోస్ 7 పీసీలకు

ఈ శీర్షికలో భాగంగా మేము మీకు అందించే స్టెప్స్ మీ ఫ్రెండ్స్ మీరున్న చోటుకి రావడం ద్వారా కాని లేక ప్రతి ఒక్కరూ తమ తమ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కాని వైఫై రూటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆడుకోవచ్చు. విండోస్ 10 పీసి ద్వారా పూర్తిగా ఈ మెథడ్ పనిచేస్తుంది. వైఫై రూటర్ కాన్ స్ట్ంట్ పవర్ సప్లయి ఉంటే సరిపోతుంది.ఈ స్టెప్స్ విండోస్ 10కి అలాగే విండోస్ 7 పీసీలకు పనిచేస్తుంది.

వైఫై రూటర్ ద్వారా మల్టిపుల్ గేమ్స్ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం ఎలా ?

స్టెప్ 1

ప్రతి ఒక్కరి ల్యాపీ వైఫై ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండాలి

స్టెప్ 2

ఎవరైతే ఈ గేమ్ కి హోస్ట్ కావాలనుకుంటున్నారో వారు టాస్క్ బార్ మీద కనిపించే వైఫై ఆప్సన్ మీద రైట్ క్లిక్ చేసి Open Network & Internet settingsని సెలక్ట్ చేసి ఓపెన్ చేయాలి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం తప్పనిసరిగా కలిగి ఉండాలి.

స్టెప్ 3

మొబైల్ హాట్ స్పాట్ లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే Network and Sharing Centerని క్లిక్ చేయాలి. సేమ్ నెట్ వర్క్ ద్వారా గేమ్ లోకి జాయిన్ కావాలి.

స్టెప్ 4

ఆ తర్వాత కనిపించే నెక్ట్స్ విండో ఆప్సన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత షేరింగ్ మీద క్లిక్ చేయాలి.

స్టెప్ 5,
అక్కడ మీకు Allow other users to connect with this computer's Internet connection'అని కనిపిస్తుంది. అక్కడ మీకు కనిపించే మల్టిపుల్ గేమ్ మీద కాని న్యూ లాన్ గేమ్ మీద కాని క్లిక్ చేయాలి.

స్టెప్ 6,

ప్రతి ఒక్కరూ తమ ల్యాపీల నుంచి గేమ్స్ ని ఓపెన్ చేయాలి. ఒకసారి గేమ్ హోస్ట్ అయిన తరువాత అందులో జాయిన్ కావాలి. ఆ తర్వాత మీరు గేమింగ్ లోకి ఎంటరవుతారు. మీకు నచ్చిన గేమ్ ని వైఫై ద్వారా ఆడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to play multiplayer games with friends on Windows 10 using Wi-Fi router
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X