మొబైల్ నెంబర్ మార్చకుండా వేరే నెట్‌వర్క్‌లోకి మారటం ఏలా..?

Posted By: Super

 మొబైల్ నెంబర్ మార్చకుండా వేరే నెట్‌వర్క్‌లోకి మారటం ఏలా..?

 

మీ ప్రస్తుత మొబైల్ నెట్‌వర్క్ సిగ్నలింగ్ వ్యవస్థ లోపంతో విసుగెత్తిస్తుందా..?, కొత్త నెట్‌వర్క్‌లోకి మారుదామనుకుంటున్నారా..?,  అయితే, మీ ప్రస్తుత నెంబర్‌తోనే కొత్త నెట్‌వర్క్‌లోకి మారిపోవచ్చు... ఇది ఏలా సాధ్యమనుకుంటున్నారా..?, ట్రాయ్ గత ఏడాది అమలు చేసిన ‘మొబైల్ నంబర్ పోర్టబులిటి ఆఫర్’తో  కొత్త నెట్‌వర్క్‌లోకి మారినా పాత్ మొబైల్ నెంబర్‌తోనే  కమ్యూనికేషన్ బంధాలను కొనసాగించవచ్చు.

Read in English:

పాత నెంబర్‌తోనే కొత్త నెట్‌వర్క్‌లోకి మారటం ఏలా..?

-   మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి  బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో  అందుతుంది.

- ఈ కోడ్ ఆధారంగా  మీరు మారాలనుకుంటున్న నెట్‌వర్క్ ఆపరేట్‌ర్‌ను సంప్రదించి సంబంధిత అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా  మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను సమర్పించాల్సి ఉంది.  మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ప్రక్రియలో భాగంగా మీ నుంచి 19రూపాయిలను వసూలు చేస్తారు. సిమ్ ఛార్జీలు అదనం.

- వారం రోజుల్లోపు మీ నెంబర్ కొత్త నెట్‌వర్క్‌లోకి యాక్టివేట్ అవుతుంది.  పోర్టబులిటీ చేసుకోబయే నెంబర్ తప్పనిసరిగా 90 రోజులకు మించి వాడకంలో ఉండాలనే నిబంధన ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot