మీ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయా.. వీటిని ఏర్పాటు చేసుకోండి..!!
విద్యుత్ సరఫరాలో అకస్మాత్తుగా తలెత్తిన అంతరాయం (Power Outage) రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. మీకు నచ్చిన సినిమా లేదా ప్రోగ్రాంలు చూస్తున్నప్పుడు లేదా ముఖ్యమైన పనుల కోసం ల్యాప్‌టాప్, ఫోన్ వంటివి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఈ అంతరాయం బాగా ఇబ్బంది పెడుతుంది. దీంతోపాటు ప్రకృతి విపత్తులు సమయాల్లోనూ ఎక్కువ గంటలపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాలి వస్తుంది.
డ్యామేజీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి : ఇటువంటి సమయాల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను డ్యామేజీ కాకుండా జాగ్రత్తపడొచ్చు. ఇందుకోసం UPS, సర్జ్ ప్రొటెక్టర్‌లు, వోల్టేజ్ స్టెబిలైజర్‌లు సహా పవర్ ఇన్వర్టర్‌ల ద్వారా విద్యుత్ ఉపకరణాలను డ్యామేజీ కాకుండా చూడొచ్చు. మరియు ఈ పరికరాలు ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా ఉపయోగపడతాయి. మరియు ముఖ్యమైన పనులను వెంటనే చక్కబెట్టేందుకు అవకాశం ఉంది.

UPS వినియోగం : తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లో UPS (Uninterruptible Power Supply) ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు కంప్యూటర్‌ను వినియోగిస్తుంటే UPS ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా.. కొంత సమయంపాటు కంప్యూటర్‌ను వినియోగించుకొనేందుకు వీలుంటుంది. ఫలితంగా ముఖ్యమైన డాక్యుమెంట్‌లు సేవ్ చేసుకోవచ్చు.
సర్జ్ ప్రొటెక్టర్‌లు : విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు డ్యామేజీ కాకుండా ఈ సర్జ్ ప్రొటెక్టర్‌లు ఉపయోగపడతాయి. విద్యుత్ ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో విద్యుత్ ఉపకరణాలు డ్యామేజీ కాకుండా అడ్డుకుంటాయి. అధిక జౌల్ రేటింగ్ ఉన్న సర్జ్ ప్రొటెక్టర్‌లను ఎంచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
వోల్టేజ్ స్టెబిలైజర్ వినియోగం : ఎలక్ట్రానిక్ పరికరాలకు స్థిరంగా విద్యుత్ సరఫరా అయ్యేలా వోల్టేజ్ స్టెబిలైజర్ లు (Voltage Stabilizer) ఎంతో ఉపయోగపడతాయి. దీంతోపాటు విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతుంటే మాత్రం ఎలక్ట్రానిక్ పరికరాలను డిస్ కనెక్ట్ చేయడం ఉత్తమం. లేకుంటే డ్యామేజీ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఇన్వర్టర్ లేదా జనరేటర్లు : కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో కంప్యూటర్ లు వినియోగం, రీఫ్రిజిరేటర్ల సహా ముఖ్యమైన పరికరాలకు విద్యుత్ సరఫరా కోసం ఇన్వర్టర్‌లు లేదా జనరేటర్లు (Inverter) ఎంతో ఉపయోగపడతాయి.

దీంతోపాటు ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు సహా ఇతర రీఛార్జ్‌బుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను ముందుగానే ఛార్జింగ్ చేయడం ఉత్తమం. మరియు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు సంభవించినా పరికరాలు డ్యామేజీ కాకుండా ఉండే వాటిని కొనుగోలు చేయాలి. ధర అధికంగా ఉన్నా.. ఇలాంటి సమయాల్లో విద్యుత్ పరికరాలు డ్యామేజీ కాకుండా ఉంటాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications