పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా ?

By Gizbot Bureau
|

మీరు ఉచిత వైపై కోసం వెతుకుతున్నారా..ఇప్పుడు అది చాలా రిస్క్ తో కూడుకున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉచిత వైఫై కోసం మీరు ఇచ్చే వివరాలతో మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ నార్టన్‌ ఇటీవల తెలిపింది. పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని వారి చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్‌ సర్వే హెచ్చరిస్తోంది. ఆన్‌లైన్‌ సెక్యూరిటీ కోసం వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్‌లలో హెచ్‌టీటీపీఎస్‌ ప్రొటోకాల్‌ ఉందో.. లేదో.. చూసుకోవాలి. అయితే నెట్‌వర్క్‌ సురక్షితంగా లేకపోతే హెచ్‌టీటీపీఎస్‌ ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. వైఫై నెట్‌వర్క్‌ ఆటోమేటిక్‌గా కనెక్టయ్యే ఆప్షన్స్‌ ఉంటే వాటిని వాడకపోవడమే మేలు. Public Wi-Fi Networks వాడేవారు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే.

పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా ?

 

Keep your connection secure

పబ్లిక్ వై-ఫైతో కనెక్ట్ అయి ఉన్నపుడు ఆన్ లైన్ బ్యాంకింగ్, షాపింగ్ వంటి లావాదేవీలను నిర్వహించటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ విధమైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు హోమ్ లేదా వర్క్ ప్లేస్ నెట్ వర్క్ ను ఉపయోగించుకోండి. మార్గమధ్యంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను వినయోగించుకోవల్సి వస్తే పబ్లిక్ వై-ఫైకు బదులుగా మొబైల్ డేటాను ఉపయోగించుకోండి. మీ స్మార్ట్ ఫోన్ లోని 3జీ నెట్ వర్క్ కంటే వేగవంతమైన ఇంటర్నెట్ ను పబ్లిక్ వై-ఫై లు అందించగలవు. అయితే, మీ డివైస్ కు వై-ఫై రౌటర్ కు దూరం పెరిగే కొద్ది కనెక్టువిటీ వేగం మందగిస్తుంది. తాజాగా మొబైల్ ఫోన్ ల కోసం అందుబాటులోకి వచ్చిన 4జీ కనెక్టువిటీ 3జీ, వై-ఫై హాట్ స్పాట్ లతో పోలిస్తే వేగవంతమైన ఇంటర్నెట్ ను కనెక్టువిటీని ఆఫర్ చేస్తోంది.

Disable file sharing

మీరు వినియోగించే స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో ఏ చిన్న సెక్యూరిటీ లోపమున్నా మీ డివైస్ హ్యాకర్లకు అందుబాటులో ఉన్నట్లే. మీ విండోస్ పీసీలో ఫైర్ వాల్ ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ఉంచాలి. అలానే, మీ స్మార్ట్ ఫోన్ లో యాంటీ వైరస్ యాప్ ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాలి. తరచూ లేటెస్ట్ ఓఎస్ అప్ డేట్ లను పొందటం ద్వారా కూడా సెక్యూరిటీ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఫైల్ షేరింగ్ ని డిసేబుల్ చేయాలి. ఇందుకోసం కింది పద్దతులు ఉపయోగించండి

Windows 10:

Control Panel > Network and Internet > Network and Sharing Center > Advanced sharing settings >Turn off file and printer sharing

Windows 8

Control Panel > Network and Internet > View network status and Tasks > Change advanced sharing settings > Turn off file and printer sharing and network discovery> Save changes.

Windows 7:

 

Control Panel > Network and Sharing Center > Change advanced sharing settings > Home or Work > Turn off file and printer sharing > Save changes.

Mac OS X:

System Preferences > Sharing

Use two-factor authentication

మీరు ఎల్లప్పుడూ two-factor authenticationని ఉపయోగించండి. password and a secondary code ని ఎప్పటికప్పుడూ ఛేంజ్ చేస్తూ వెళ్లండి. ఇప్పుడు అన్ని వెబ్ సైట్లు ఈ రకమైన మెథడ్ ని ఆఫర్ చేస్తున్నాయి. Google, Facebook, Twitter, LinkedIn, Apple and Microsoft లాంటి కంపెనీలు two-factor authenticationని అందిస్తున్నాయి.

Use a VPN

ప్రతీసారి VPN నుంచే లాగిన్ కావడం మంచిది. అలాగే పబ్లిక్ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్ వేర్ లను ఇన్స్ స్టాల్ చేసుకోవద్దు. ఈ చర్య మీ వ్యక్తిగత డేటాకే ప్రమాదం కావొచ్చు. కొన్ని పబ్లిక్ వై-ఫై కేంద్రాల సాఫ్ట్ వేర్ అప్ డేట్ ల ముసుగులో మాల్వేర్లతో కూడిన ప్రోగ్రామ్ లను మీ డివైస్ ల్లోకి జొప్పించి మీ డేటాను దొంగిలించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్ వేర్ లను ఇన్స్ స్టాల్ చేసుకోకండి.

Know your network

మీరు పబ్లిక్ వై-ఫై కి కనెక్ట్ అయ్యే ముందు ఓ సారి network చెక్ చేసుకోవడం మంచిది. మీరు వైఫై ఆటోమేటిక్ కనెక్షన్ మోడ్ లో అసలు ఉంచుకోవద్దు.. పర్మిషన్ ఇచ్చేలా సెట్ చేసుకోండి. అదీకాక కొన్ని పబ్లిక్ వై-ఫైల వద్ద పాస్ వర్డ్ అస్తవ్యస్తంగా ఉండటం కారణంగా మీ డేటాను హ్యాకర్లు సులువుగా దొంగిలించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి, అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే పబ్లిక్ వై-ఫైను ఎంపిక చేసుకోండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Protect Your Privacy on Public Wi-Fi Networks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X