ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలా ?

వాట్సప్.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఫేస్ బుక్ సొంతమైన ఈ యాప్ ఇన్ స్టంట్ మెసేజింగ్ రంగంలో టాప్ లో దూసుకవెళుతూ యూజర్లను బానిసలుగా మార్చుకుంటుందంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క

|

వాట్సప్.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఫేస్ బుక్ సొంతమైన ఈ యాప్ ఇన్ స్టంట్ మెసేజింగ్ రంగంలో టాప్ లో దూసుకవెళుతూ యూజర్లను బానిసలుగా మార్చుకుంటుందంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకునేది ఈ యాప్ నే. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఇందులోనే ఎక్కువగా ఛాటింగ్ చేసేవాళ్లు ఉన్నారు. యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వాట్సప్ కూడా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలా ?

అయితే కొన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నా మరికొన్ని ఫీచర్లు అందుబాటులో లేవు. ఇందులో వాట్సప్ రికార్డింగ్ కాల్స్ ఒకటి. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ధర్డ్ పార్టీ యాప్ ద్వారా మనం వాట్సప్ కాల్స్ రికార్డు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

Cube Call Recorder app

Cube Call Recorder app

ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి Cube Call Recorder app యాప్ ని మీ మొబైల్ లోకి డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఆ తరువాత వాట్సప్ నుంచి కాల్ చేయండి. మీరు కాల్ చేయగానే మీ స్క్రీన్ మీద వాట్సప్ కాల్ రికార్డు చేయాలా అనే బటన్ వస్తుంది. మైక్రోఫోన్ ఐకాన్ మాదిరిగా కనిపించే ఈ బటన్ ని ట్యాప్ చేయండి. వెంటనే కాల్ రికార్డ్ అవుతుంది.

స్టెప్ 3
 

స్టెప్ 3

అయితే కొన్ని సార్లు ఆడియో చక్కగా రాకపోవచ్చు. దాన్ని ఫిక్స్ చేసేందుకు కాల్ రికార్డు అయిన తరువాత కింద మైక్రోఫోన్ ఐకాన్ మాదిరిగా రికార్డింగ్ ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని రకాల ఆప్సన్లు కనిపిస్తాయి.

స్టెప్ 4

స్టెప్ 4

ఆ ఆప్సన్ లోకి మీరు వెళితే రికార్డింగ్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్నిక్లిక్ చేస్తే మీకు కొన్నిరకాల ఆప్సన్లు కనిపిస్తాయి. వాటిల్లో మీరు voip recording అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి. దాన్నిట్యాప్ చేస్తే కొన్ని ఆప్సన్లు కనిపిస్తాయి. వాటిల్లో మీరు మైక్రోఫోన్ అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

ఐఫోన్లో రికార్డ్ చేయడం ఎలా

ఐఫోన్లో రికార్డ్ చేయడం ఎలా

ఐఫోన్లో వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయాలంటే సెకండరీ డివైస్ అవసరం అవుతుంది. మీరు మీ ఐఫోన్ ని మాక్ సిస్టంకు కనెక్ట్ చేసిన తరువాత మీ మాక్ సిస్టంలో క్విక్ టైం ప్లేయర్ ఓపెన్ చేయండి. అందులో ఫైల్ మెనూ అనే ఆప్సన్ ఓపెన్ చేసి అందులో న్యూ ఆడియో రికార్డ్ సెలక్ట్ చేసుకోండి.

సెకండరీ డివైస్ నుంచి

సెకండరీ డివైస్ నుంచి

మీ సెకండరీ డివైస్ నుంచి మీరు వాట్సప్ కాల్ చేయండి. కాల్ కనెక్ట్ అయిన తరువాత పైన కనిపించే గ్రూపు కాలింగ్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ఐఫోన్ యూజర్ అనే ఆప్సన్ కనపడుతుంది. కాల్ మాట్లాడటం అయిపోయిన తరువాత దాన్ని స్టాప్ చేస్తే అది ఆటోమేటిగ్గా మీ మ్యాక్ లో సేవ్ అవుతంది

Best Mobiles in India

English summary
How to Record WhatsApp Calls on Android and iPhone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X