ఫేస్‌బుక్ ఫాలోవర్లని రిమూవ్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్ అకౌంట్ వాడుతుంటారు? మన అకౌంట్లో పరిచయం లేనివారంతా ఫ్రెండ్ రిక్వెస్టులు, ఫాలోవర్లుగా ఉంటారు. తెలిసిన స్నేహితుల కంటే తెలియనివారే ఎక్కువ మంది ఫాలోవర్లుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రైవసీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన వారితో ముచ్చటించడం మంచిది కాదని భావిస్తే.. అలాంటి యూజర్లను వెంటనే బ్లాక్ చేయొచ్చు.. లేదా ఫాలోవర్ల లిస్టు నుంచి రిమూవ్ చేయొచ్చు.

ఫేస్బుక్ ప్రైవసీ

అయితే చాలామంది యూజర్లు ఫేస్ బుక్ లో ప్రైవసీ సెట్టింగ్స్ ఎన్నిసార్లు మార్చినా కొన్ని ఆప్షన్లపై నేవగేట్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఈ ట్రిక్స్ ద్వారా మీ సోషల్ అకౌంట్లో స్నేహితుల కానివారిని రిమూవ్ లేదా బ్లాక్ చేయొచ్చు. వారిని మీ ప్రొఫైల్ యాక్సస్ చేయకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ ప్రత్యేకించి ఒక ఫాలోవర్ ను మీరు రిమూవ్ చేయలేనిపక్షంలో మీ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఏ ఫాలోవర్ అయినా ఈజీగా రిమూవ్ చేసేయొచ్చు. లేదా మీ ప్రొఫైల్ పేజీని యాక్సస్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. 

స్టెప్ 1

స్టెప్ 1

టాప్ రైట్ కార్నర్‌లో Down Arrow బటన్ పై క్లిక్ చేయండి.

మెనులోని Settings బటన్ పై Click చేయండి.

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బార్‌లో Pubic Posts ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

Dropdown menuలో ‘Who can follow me' లో Friends ఆప్షన్ ఎంచుకోండి.

మొబైల్ డివైజ్‌లో

మొబైల్ డివైజ్‌లో

మొబైల్ డివైజ్‌లో Facebook ఫాలోవర్లను రిమూవ్ చేయండిలా? :

ఫేస్‌బుక్ అకౌంట్లో కిందిభాగంలో మూడు నిలువు గీతలపై Tap చేయండి.

స్ర్కోల్ డౌన్ చేసి Settings & Privacy బటన్‌పై Tap చేయండి.

drop-down మెనూపై Settings పై Tap చేయండి.

స్ర్కోల్ డౌన్ చేసి Privacy సెక్షన్ లో Public posts పై tap చేయండి.

Who can Follow me కింద Friends బబుల్ Tap చేయండి.

బ్లాక్ చేయాలంటే 

బ్లాక్ చేయాలంటే 

మీ ఫేస్ బుక్ అకౌంట్లో ఫ్రెండ్ కానీ వ్యక్తి ఫాలో నుంచి అన్ ఫాలో చేయడానికి మరో దారి లేదు. అది వారి చేతుల్లో మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ వారిని మీరు బ్లాక్ చేయొచ్చు. లేదంటే.. వారిని రిస్ట్రిక్టెడ్ లిస్టులో యాడ్ చేయండి... ఒకవేళ మీరు వారిని రిస్ట్రిక్టెడ్ లిస్టులో యాడ్ చేస్తే కేవలం మీరు పోస్టు చేసే పబ్లిక్ పోస్టులు మాత్రమే వారు చూడగలరు. 

ఫాలోవర్‌ను బ్లాక్ చేయాలంటే? :

మీ ఫ్రొఫైల్ ఫాలో అయ్యే వ్యక్తి ప్రొఫైల్ పేజీకి వెళ్లండి.

ఫేస్ బుక్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్‌లో బ్లాక్ చేయడం లేదా రిస్ట్రిక్ట్ చేయండి.

కుడివైపు భాగంలో ఆ వ్యక్తి పేరు కింద కనిపించే మూడు డాట్స్ (...) పై Tap చేయండి.

Manage menu పై Block ట్యాప్ చేసి Confirm చేయండి.

Restricted listలో యాడ్

Restricted listలో యాడ్

మొబైల్ యాప్ నుంచి ఎవరినైనా మీ Restricted listలో యాడ్ చేయాలంటే? :

ఇక్కడ కూడా మీ Profile పేజీలోకి వెళ్లండి.

ఎడమవైపు భాగంలో మూడు డాట్లపై కనిపించే వారి పేరు కింద Friends బటన్ పై నొక్కండి.

కింది భాగంలో Pop-up menuలో Edit Friend Lists పై ట్యాప్ చేయండి.

అదే మెనూలో Restricted బటన్ పై tap చేయండి. 

PC నుంచి Facebook అకౌంట్లో మీ Restricted listలో యాడ్ చేయాలంటే? :

PC నుంచి Facebook అకౌంట్లో మీ Restricted listలో యాడ్ చేయాలంటే? :

PC నుంచి Facebook అకౌంట్లో మీ Restricted listలో యాడ్ చేయాలంటే? :

వారి ఫేస్ బుక్ ప్రొఫైల్ పేజీలోకి వెళ్లండి.

డ్రాప్ డౌన్ మెనూలో Friends బటన్ కింద క్లిక్ చేయండి.

Add to another list పై Click చేయండి.

Restricted బటన్‌పై Click చేయండి.

Best Mobiles in India

English summary
how to remove, block or add followers on Facebook and manage the restricted list.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X