జియో నంబర్ నుండి కాలర్ ట్యూన్ తీసేయడం ఎలా ?

By Gizbot Bureau
|

జియో సిమ్ వాడుతున్న‌వాళ్లంతా త‌మ ఫేవ‌రెట్ సాంగ్‌ను కాల‌ర్ ట్యూన్‌గా పెట్టుకోవ‌చ్చు. అది కూడా ఉచితంగా పెట్టుకోవచ్చు. మెసేజ్ ద్వారా కాని, జియో మ్యూజిక్ యాప్ ద్వారా గానీ వేరేవాళ్ల కాల‌ర్ ట్యూన్‌ బ‌ట‌న్ నొక్కడం ద్వారా గానీ కాల‌ర్ ట్యూన్ సెట్ చేసుకోవ‌చ్చు. అయితే కాలర్ ట్యూన్ బాగా లేని సందర్భంలో దాన్ని తీసేయడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఫోన్ నంబర్ నుంచి కాలర్ ట్యూన్ తీసేయడం ఎలాగో చాలామందికి తెలియదు కూడా. అలాంి వారి కోసం కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం. ఈ ట్రిక్స్ ద్వారా కాలర్ ట్యూన్ నచ్చకుంటే తీసేయండి.

 

ఎసెమ్మెస్ ద్వారా

ఎసెమ్మెస్ ద్వారా

మీ స్మార్ట్ ఫోన్ నుండి మెసేజ్ యాప్ ఓపెన్ చేయండి. అక్కడ STOP అని మెసేజ్ టైప్ చేసి 56789కి సెండ్ చేయండి. రిప్లయి వచ్చిన తరువాత డియాక్టివేషన్ కొరకు 1 బటన్ ప్రెస్ చేయండి. ప్రాసెస్ పూర్తి కాగానే మీకు JioTunes services have been deactivated on your number." అనే మెసేజ్ వస్తుంది.

జియో నంబర్ ద్వారా

జియో నంబర్ ద్వారా

మై జియో యాప్ ఓపెన్ చేయండి. అక్కడ మెనూలో కనిపించే జియో ట్యూన్ సెలక్ట్ చేయండి. తర్వాత My Subscriptions page లోకి వెళ్లి డియాక్టివేట్ జియో ట్యూన్ నొక్కండి. ఇది కింది భాగంలో ఉంటుంది. తరువాత ఒకే బటన్ ప్రెస్ చేయండి.

ఐవీఆర్ ద్వారా
 

ఐవీఆర్ ద్వారా

మీ స్మార్ట్ ఫోన్ లో డయలర్ యాప్ ఓపెన్ చేయండి. 155223 నంబర్ కి డయల్ చేయండి. లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకున్న తరువాత active Value-added-services అని మీకు వినిపిస్తుంది. దానిలో మీరు డియాక్డివేట్ జియో ట్యూన్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

రియాక్టివేట్ చేసుకోవడం ఎలా?

రియాక్టివేట్ చేసుకోవడం ఎలా?

మై జియో యాప్ లోకి వెళ్లండి. అక్కడ మీ నంబర్ ను సెలక్ట్ చేసుకోండి. లెఫ్ట్ కార్నర్ లో కనిపించే మూడు డాట్లను క్లిక్ చేయండి. అక్కడ కనిపించే జియో ట్యూన్స్ ని సెలక్ట్ చేుకోండి. అందులో మీకు నచ్చిన సాంగ్ సెలక్ట్ చేసుకుని జియో ట్యూన్ గా యాక్టివేట్ చేసుకోండి.

Best Mobiles in India

English summary
How to remove caller tune from your Jio number

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X