ఆ వెబ్‌సైట్‌ల నుంచి మీ మెయిల్ అకౌంట్‌ను తీసివేయాలా.. వెంటనే ఇలా చేయండి..!!
గూగుల్ సహా ఇతర సెర్చ్ ఇంజిన్ లలో సమాచారం తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్న సందర్భాల్లో కొన్ని వెబ్‌సైట్ లు లాగిన్ షరతును విధిస్తాయి. అంటే మన మెయిల్ (Gmail) అడ్రస్ తో ఆయా వెబ్‌సైట్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది. అప్పుడే అందులోని పూర్తి సమాచారాన్ని చూసేందుకు అవకాశం ఉంటుంది. అయితే అలా లాగిన అయిన్ జీమెయిల్ ఐడీ లను ఇతర పనుల కోసం ఉపయోగించడం లేదా మీకు అవసరం లేని సమాచారాన్ని మీ మెయిల్ కు పంపడం జరుగుతుంది.
ఈ రెండింటి వల్ల మీరు అవస్థలు పడే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి. మీరు గతంలో లాగిన అయిన వెబ్‌సైట్‌ల నుంచి అవసరం లేని మెయిల్‌లు రాకుండా ఏం చేయాలి. మీరు ఏ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యారు.. మళ్లీ అలాంటి వెబ్‌సైట్‌ల నుంచి ఎలా బయటకు రావాలి వంటి వివరాలు ఈ కథనంలో..

వెబ్‌సైట్‌ల నుంచి ఈమెయిల్ అడ్రస్‌ను డిలీట్ చేయడం ఎలా?
తొలుత www.gmail.com లోకి వెళ్లి.. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. అనంతరం ప్రొఫైల్ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. అనంతరం Manage your Google Account పైన క్లిక్ చేయండి. అప్పుడు మీరు సెట్టింగ్స్ పేజీకి వెళ్తారు. తర్వాత అక్కడ మీకు కనిపించిన సెక్యూరిటీ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
అనంతరం పేజీని కిందకు స్క్రోల్ చేయాలి. అక్కడ Third Party apps with account access కనిపిస్తుంది. అక్కడ కనిపించిన మేనేజ్ థర్డ్ పార్టీ యాక్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్‌తో లాగిన అయిన వెబ్‌సైట్‌లు యాప్‌ల జాబితా కనిపిస్తుంది. అందులో నుంచి మీకు అవసరం లేని వెబ్‌సైట్, యాప్‌లను తొలగించవచ్చు.
**దీంతోపాటు గూగుల్ మ్యాప్స్‌లో గోప్యత గురించి ఆందోళన చెందేవారికి సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. గూగుల్ క్లౌడ్‌లో ప్రైవసీ సమస్యలు కారణంగా గోప్యత నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ మ్యాప్స్ డేటాను క్లౌ్డ్‌లో కాకుండా యూజర్ల మొబైల్‌లోనే భద్రపరచనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు గూగుల్ లోకేషన్ హిస్టరీని 'టైమ్‌లైన్' గా పేరు మారుస్తున్నట్లు తెలిపింది.
గూగుల్ మ్యాప్స్ ప్రైవసీ నిబంధనలు ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిపై యూజర్లకు గూగుల్ ఈమెయిల్ పంపింది. పాత ప్రయాణాలకు సంబంధించిన డేటాను యూజర్ల మొబైళ్లలో భద్రపరిచేందుకు కేవలం డిసెంబర్ 1 వరకు మాత్రమే సమయం ఉందని తెలిపింది. అనంతరం పాత డేటాను తొలగించడం ప్రారంభం అవుతుందని పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOS వెర్షన్ గూగుల్ మ్యాప్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, వెబ్ వెర్షన్‌లో ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తోంది. వెబ్ ఇంటర్‌ఫేజ్ ద్వారా యూజర్లు వారి లోకేషన్ హిస్టరీని తెలుసుకోవచ్చు. అయితే వెబ్ వెర్షన్‌లో ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అందువల్ల వెబ్, మొబైల్ మధ్య లోకేషన్ డేటా సింక్ అయ్యేందుకు అవకాశం లేదు.


Click it and Unblock the Notifications








