Google ఫోటోస్ నుండి డెలిట్ చేసిన ఫోటోలు & వీడియోలను తిరిగి పొందడం ఎలా?

|

ఐఫోన్ లేదా PCకి అవసరమైన 'ఇటీవల తొలగించిన' ఫోల్డర్ లేదా ట్రాష్ బిన్ ఉంది. ఇక్కడ మీరు పొరపాటున తొలగించిన ఫోటోలను తిరిగి పొందవచ్చు. వన్‌ప్లస్ వంటి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ ఆప్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ అన్నీ ఇటువంటి ప్రయోజనాన్ని అందించవు. అయితే Google ఫోటోస్ మరియు Google డిస్క్ మీరు తొలగించిన ఫోటోలు మరియు వీడియోలను కూడా తిరిగి పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫారమ్ ఫోటోలను ఉచితంగా అప్‌లోడ్ చేయడానికి మరియు వాటిని మీ ఫోన్ లో ఎప్పుడైనా యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. గూగుల్ ఫోటోలు లొకేషన్, సమయం మొదలైన వాటి ఆధారంగా ఫోటోలను వర్గీకరిస్తాయి. ఒకవేళ మీరు పోగొట్టుకున్న ఫైల్‌లను తిరిగి ఎలా పొందవచ్చో అని ఆలోచిస్తున్నట్లయితే కింద తెలిపే కొన్ని సాధారణ చిట్కాలను ఉపయోగించి పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Restore Deleted Photos and Videos From Google Photos

Google ఫోటోస్ నుండి తొలగించిన ఫోటోలను తిరిగి పొందే విధానం

స్టెప్ 1- మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో తొలగించిన ఫోటో లేదా వీడియోని తిరిగి పొందడానికి Google ఫోటోస్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2- దిగువన కనిపించే 'లైబ్రరీ' ట్యాబ్‌ మీద నొక్కండి.

స్టెప్ 3- ఎగువ బాగాన మీరు 'ట్రాష్' ఫోల్డర్‌ను కనుగొంటారు. మీరు తొలగించిన అన్ని ఫోటోలను తనిఖీ చేయడానికి దానిపై నొక్కండి.

స్టెప్ 4- ఫోటో లేదా వీడియోను పునరుద్ధరించడానికి దాని మీద నొక్కండి. దిగువన ఉన్న రిస్టోర్ ఎంపికను నొక్కండి. పొరపాటున తొలగించబడిన ఫోటో లేదా వీడియో అప్పుడు పునరుద్ధరించబడుతుంది.

స్టెప్ 5- దీన్ని మీ PC లో పునరుద్ధరించడానికి photos.google.com కి వెళ్లండి (మీరు మీ Google అకౌంటులో సైన్ ఇన్ చేసారని నిర్ధారించుకోండి)

How to Restore Deleted Photos and Videos From Google Photos

స్టెప్ 6- ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత విండో యొక్క ఎడమ వైపున ఉన్న ట్రాష్ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 7- మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫోటోలు మరియు వీడియోలపై క్లిక్ చేసి ఆపై ఎంచుకోండి ఎంపికను నొక్కండి.

స్టెప్ 8- ఆపై ఎగువన ఉన్న పునరుద్ధరణ బటన్‌ని నొక్కండి మరియు ఫోటో లేదా వీడియో మీ Google ఫోటోల ఖాతాకు పునరుద్ధరించబడుతుంది మరియు పేర్కొన్న ఆల్బమ్‌కు తిరిగి జోడించబడుతుంది.

Google ఫోటోస్ 60 రోజుల ముందు వరకు తొలగించిన వాటిని మాత్రమే తిరిగి పొందుతాయని తెలుసుకోవడం విలువైనది. తద్వారా ఫోటోలు ఈ ఫోల్డర్‌లో నిర్ణీత సమయం వరకు ఉంటాయి. క్లౌడ్ స్టోరేజ్ అపరిమిత ఫోటోలు మరియు వీడియోల బ్యాకప్‌ను ఉచితంగా అందిస్తుంది మరియు 16 మెగాపిక్సెల్స్ మరియు 1080p HD పరిమితికి మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
How to Restore Deleted Photos and Videos From Google Photos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X