ఆండ్రాయిడ్ ఫోన్‌లో రెండు WhatsApp అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?
డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగించుకుంటోన్న చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లోని రెండు నెంబర్లకు వేరువేరు వాట్సాప్ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక ఉంటుంది.

Read More : జియో 'Welcome Offer' వచ్చేసింది, పొందాలంటే ఇలా చేయండి
అయితే వాట్సాప్ నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన మొబైల్ డివైస్‌లో ఒక వాట్సాప్ అకౌంట్‌ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అయితే మార్కెట్లో లభ్యమవుతోన్న OGWhatsApp అనే యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఏకకాలంలో మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది అది ఏలాగో చూసేద్దామా మరి.

#1
ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లోని మునుపటి వాట్సాప్ అకౌంట్‌కు సంబంధించిన డేటాను పూర్తిగా బ్యాకప్ తీసుకుని రీస్టోర్ చేయండి.

#2
Settings>apps>WhatsApp>Clear Data ఆప్షన్‌లలోకి వెళ్లి వాట్సాప్ డేటాను మొత్తం డిలీట్ చేయండి.

#3
మీ ఫోన్‌లోని sdcard/WhatsApp directoryని sdcard/OGWhatsAppగా పేరు మార్చండి.

#4
మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఒరిజినల్ వాట్సాప్ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయండి.

#5
ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో OGWhatsAppను ఇన్‌స్టాల్ చేయండి.

#6
ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత పాత నెంబరుతో OGWhatsAppలో రిజిస్టర్ అవ్వండి.

#7
ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మరొక నెంబర్‌తో రిజిస్టర్ అవ్వండి.


Click it and Unblock the Notifications








