స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ని సేవ్ చేసుకోవడం ఎలా ?

By Gizbot Bureau
|

ఆండ్రాయిడ్ డివైస్‌లను వాడే ప్రతి యూజర్ ఎదుర్కొనే సమస్య బ్యాటరీ బ్యాకప్. ఇంటర్నెట్ వాడినా, గేమ్స్ ఆడినా, ఫొటోలు, వీడియోలు చూసినా అధిక మొత్తంలో బ్యాటరీ ఖర్చవుతూ ఉంటుంది. కాల్స్, ఎస్‌ఎంఎస్, ఇన్‌స్టాంట్ మెసేజింగ్, సెల్ఫీ, సోషల్ నెట్‌వర్కింగ్, బిల్ పేమెంట్, ఇంటర్నెట్ బ్రౌజింగ్... ఇలా చెప్పుకుంటూ పోతే నేడు మనకు లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్లతో కేవలం చిటికెలోనే ఏ పనైనా చేసుకునేందుకు వీలుంది.

Learn how to boost your smartphone battery life with these tips

అయితే ఏ పని చేసినా బ్యాటరీ పవర్ వెంటనే అయిపోవడం ఇప్పుడు అధిక శాతం మంది యూజర్లకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ శక్తిని మరింత పెంచుకునేందుకు కింద పలు 'టిప్స్‌'ను అందిస్తున్నాం. ఈ టిప్స్ పాటించండి.

Screen Brightness:

Screen Brightness:

స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ శక్తిని అధికంగా వినియోగించుకునే వనరుల్లో డిస్‌ప్లే ఒకటి. మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎంత ఉంది? స్క్రీన్ బ్రైట్‌నెస్‌ 100 శాతం సెట్ చేసుకోవడం అనేకమందికి అలవాటు. వాస్తవానికి 100 శాతం బ్రైట్‌నెస్ అవసరమే లేదు. కళ్లకు కూడా మంచిది కాదు. అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను 20 శాతం తగ్గిస్తే బ్యాటరీ పవర్ కొంత పెరిగేందుకు అవకాశం ఉంది. అన్ని స్మార్ట్‌ఫోన్లల్లో బ్రైట్‌నెస్‌కు ఆటో మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బయట ఉండే వెలుతురును బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్ మారుతుంది. అందుకే స్క్రీన్ బ్రైట్‌నెస్ ఆటోమోడ్‌లో పెట్టుకోవడం మంచిది. లో సెట్ చేసుకుంటే ఇంకా మంచిది. కళ్లను కాపాడుకోవడంటంతోపాటు బ్యాటరీని ఆదా చేయొచ్చు.

 App Notifications:

App Notifications:

మీ ఫోన్‌లో ఎన్ని యాప్స్ ఉంటే అన్ని నోటిఫికేషన్స్ పంపుతూ ఉంటాయి. వీటిలో చాలావరకు అవసరం లేని నోటిఫికేషన్లే. మీకు అవసరం ఉన్న నోటిఫికేషన్లు మాత్రమే ఆన్‌ చేసి, మిగతావి డిసేబుల్ చేస్తే చాలు. బోలెడంత బ్యాటరీ సేవ్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అప్లికేషన్లను కిల్ చేస్తే బ్యాటరీ ఆదా అవుతుంది. అయితే ఈ ఫీచర్ కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. ఇది లేకపోతే ఆయా స్మార్ట్‌ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌లకు చెందిన యాప్ స్టోర్‌ల నుంచి టాస్క్ మేనేజర్ పేరిట లభించే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది.

ఛార్జింగ్

ఛార్జింగ్

బ్యాటరీ 5% లోపు వచ్చేవరకు ఛార్జింగ్ వద్దనుకునేవాళ్లు కొందరైతే... 60 శాతం కాగానే ఛార్జింగ్ పెట్టేవాళ్లు ఇంకొందరు. దీనివల్ల ఫోన్ పెర్ఫామెన్స్‌పై ప్రభావం ఉంటుంది. అందుకే బ్యాటరీ 30-40% శాతంలో ఉన్నప్పుడే ఛార్జింగ్ చేయండి. అంతేకాదు... ఫోన్ వేడెక్కితే ఛార్జింగ్ ఆపండి.

ఛార్జింగ్ ఆఫ్ చేయండి

ఛార్జింగ్ ఆఫ్ చేయండి

లొకేషన్, జీపీఎస్ ట్రాకింగ్ ఆన్‌లో ఉంచినా బ్యాటరీ చాలా ఖర్చవుతుంది. గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తూ ఎక్కడికైనా ప్రయాణించే సమయాల్లో తప్ప లొకేషన్, జీపీఎస్ ఆన్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అందుకే లొకేషన్, జీపీఎస్ ట్రాకింగ్ ఆఫ్‌లో పెట్టడం మంచిది.

 3జీ, 4జీ వంటి నెట్‌వర్క్‌లు

3జీ, 4జీ వంటి నెట్‌వర్క్‌లు

స్మార్ట్‌ఫోన్‌లో ఉండే 3జీ, 4జీ వంటి నెట్‌వర్క్‌లు బ్యాటరీని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అవసరం లేకపోతే వీటిని డిజేబుల్ చేయడమే ఉత్తమం. దీంతో బ్యాటరీ పవర్ పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ డేటా సింకింగ్ ఫీచర్ ఎల్లప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసినా బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది.

 లైవ్ వాల్‌పేపర్స్

లైవ్ వాల్‌పేపర్స్

లైవ్ వాల్‌పేపర్స్ బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తాయి. అందుకే స్టిల్ ఇమేజెస్‌ని వాల్‌పేపర్స్‌గా పెట్టుకోండి. లైవ్ వాల్‌పేపర్స్ డౌన్‌లోడ్ చేయకపోవడమే మంచిది.

Best Mobiles in India

English summary
Learn how to boost your smartphone battery life with these tips

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X