అసలే వర్షాకాలం.. అందులోనూ ల్యాప్‌టాప్.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి..!
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ల్యా్‌ప్‌ట్యాప్‌లతో ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంలో మీ ల్యాప్‌టాప్‌ను (Laptop) జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేకుండే మరమ్మతుల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో బయటకు వెళ్లాల్సి వస్తే ల్యాప్‌టాప్‌లను ఇంట్లోనే ఉంచేందుకు ప్రయత్నం చేయండి. తప్పకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో వాటర్ ఫ్రూఫ్ బ్యాగ్ లేదా జిప్ లాక్ తరహా బ్యాగ్స్‌ను ఉపయోగించండి. ఫలితంగా వర్షంలో మీరు తడిచినా ల్యాప్‌టాప్ తడవకుండా ఉంటుంది.

అయితే ఏదైనా సందర్భంలో ల్యాప్‌టాప్ వర్షంలో తడిస్తే ఏం చేయాలి?
ల్యాప్‌టాప్ వర్షంలో తడిస్తే వెంటనే బ్యాటరీ బయటకు తీసేందుకు ప్రయత్నం చేయాలి. అదే ఆన్‌లో ఉన్న సమయంలో తడిస్తే.. వెంటనే ఆఫ్ చేయాలి. లేకుంటే విద్యుత్ ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసిన ఛార్జర్ సహా అన్నింటినీ తొలగించాలి.
బియ్యం లేదా సిలికా జెల్ ప్యాక్‌లో :
అనంతరం ల్యాప్‌టాప్‌లో నీరు బయటకు వచ్చేలా తలక్రిందులుగా ఉంచాలి. అనంతరం శుభ్రమైన వస్త్రంతో ల్యాప్‌టాప్‌ను పూర్తిగా తుడవాలి. అనంతరం ల్యాప్‌టాప్ నుంచి పూర్తిగా తేమ బయటకు వచ్చేంత వరకు బియ్యం లేదా సిలికా జెల్ ప్యాక్‌లో ల్యాప్‌టాప్‌ను ఉంచాలి.

ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు :
సుమారు 24 నుంచి 48 గంటల పాటు అలానే ఉంచండి. అయితే ల్యాప్‌టాప్ నుంచి నీరు త్వరగా వచ్చేలా చేసేందుకు హెయిర్ డ్రైయర్ లేదా హీటర్‌లను ఉపయోగించవద్దు. ఇలా చేస్తే.. ల్యా్‌ప్‌టాప్ అంతర్గత విభాగాలు డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది.
సరైన అవగాహన లేకుండా ఆన్ చేయవద్దు :
ల్యాప్‌టాప్ మరమ్మతుపై సరైన అవగాహన లేకుండా ఆన్ చేసే ప్రయత్నం చేయవద్దు. దీంతోపాటు తడి ల్యాప్‌టాప్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఛార్జింగ్ చేయవద్దు. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది.
సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం ఉత్తమం :
నీరు పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపించినా.. ల్యాప్‌టాప్‌ను ఆన్ చేయవద్దు. మీకు సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి మరమ్మతు చేయించడం ఉత్తమం. అవగాహన లేకుండా ల్యాప్‌టాప్ ఆన్ చేసేందుకు ప్రయత్నం చేస్తే మరింత డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది.
వారంటీని ఉపయోగించుకోవచ్చు :
సంస్థలకు చెందిన సర్వీస్ సెంటర్లు లేదా అధీకృత సర్వీస్ సెంటర్‌లలో మాత్రమే సర్వీసింగ్ చేయించడం లేదా మరమ్మతు చేయించేందుకు ప్రయత్నం చేయండి. దీని వల్ల మీ ల్యాప్‌టాప్‌పై వారంటీని వారీ పరిగణనలోకి తీసుకుంటారు. ఫలితంగా ఎటువంటి ఖర్చు లేకుండానే రిపేర్ చేయించేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం వర్షాకాలంలో ల్యాప్‌టాప్ తడవకుండే ఉండేలా ప్రత్యేక వాటర్ ప్రూఫ్ బ్యాగ్‌లు లేదా జిప్ టైప్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కార్యాలయాలకు, కాలేజీలకు, ఇతర ప్రాంతాలకు ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లే ఉద్యోగాలు.. వీటిని ఉపయోగించడం ఉత్తమం. భారీ వర్షాల సమయాల్లోనూ ల్యాప్‌టాప్‌ను డ్యామేజీ కాకుండా ప్రొటెక్షన్ ఇస్తాయి.


Click it and Unblock the Notifications








