మొబైల్ నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయడం ఎలా?

|

ఫేస్బుక్ యాజమాన్యంలోని త్వరిత మెసేజ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు మా చాటింగ్ సెషన్లను మరింత సురక్షితంగా మరియు సులభతరం చేసింది. ఏదో సరదా నుండి తీవ్రమైన విషయాల వరకు ఇది మనకు ఎక్కువగా అవసరమయ్యే వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉండే అవకాశాన్ని ఇస్తున్నది. కానీ ఇది మెరుగ్గా ఉన్నప్పటికీ తెలియని వ్యక్తులకు మెసేజ్ లను పంపడం కష్టంగా ఉంది. అంటే మీ యొక్క సంప్రదింపు జాబితాలో ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా తెలియని వ్యక్తులతో సంభాషణలు నేరుగా సాధ్యం కాదు. మీరు వారితో సంభాషించడం ప్రారంభించడానికి ఇది వరకు ఖచ్చితంగా సేవ్ చేయవలసి ఉంది.

 
మొబైల్ నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయడం ఎలా?

కానీ ఇప్పుడు దీనికి ఒక ప్రత్యాన్మాయ మార్గం ఒకటి ఉంది! ఈ సాంప్రదాయిక పద్ధతిని సులభంగా దాటవేయడానికి మరియు వారి నెంబర్ లను సేవ్ చేయకుండా తెలియని వారికి వాట్సాప్ లో మెసేజ్లను పంపడంలో మీకు సహాయపడే కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే కనుక వాటి వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మొబైల్ నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ పంపే విధానం

ఇది వాట్సాప్ నుండే వచ్చే చట్టబద్ధమైన ప్రత్యామ్నాయం. ఇది ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు పనిచేస్తుంది. కావున ఈ విధానాన్ని అనుసరించడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా బ్రౌజర్‌ను తెరవండి.

స్టెప్ 2: ఈ URL ను టైప్ చేయండి: http://wa.me/xxxxxxxxx, ఇక్కడ X లలో దేశ కోడ్‌తో పాటు ఫోన్ నంబర్ ను ఇవ్వవలసి ఉంటుంది. మీరు అడ్రస్ బాక్స్ లో http://api.whatsapp.com/send?phone=xxxxxxxxx అని కూడా టైప్ చేయవచ్చు.

స్టెప్ 3: ఇప్పుడు X లను మొబైల్ నంబర్‌తో భర్తీ చేయండి. ఉదాహరణకు మీరు "https://wa.me/919812345678" అని టైప్ చేయాలి.

స్టెప్ 4: మీరు ఎంటర్ కీని నొక్కే ముందు మీరు నమోదు చేసిన వివరాలను మరొకసారి తనిఖీ చేసి 'ఎంటర్' బటన్‌ను నొక్కండి.

స్టెప్ 5: మీరు ఇప్పుడు మరొక లింక్‌కి తీసుకెళ్లబడతారు. ఇది మీరు నమోదు చేసిన నెంబర్ ను ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ మెసేజ్ ను పంపడం ప్రారంభించే ఎంపికను ప్రదర్శిస్తుంది.

స్టెప్ 6: మీరు ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ యొక్క వెబ్ వెర్షన్‌కు తీసుకెళ్లబడతారు. అక్కడ మీరు నంబర్‌ను సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎవరితోనైనా సంభాషణను ప్రారంభించగలరు. మీ ఫోన్ చాట్ జాబితాలో కనిపించిన తర్వాత సంభాషణను కొనసాగించవచ్చు.

Best Mobiles in India

English summary
How to Send WhatsApp Messages Without Saving Mobile Number

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X