WhatsApp నుంచి స్మార్ట్ ఫోన్ స్టోరేజిని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరు వాట్స్ యాప్ యూస్ చేస్తున్నారు.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరు వాట్స్ యాప్ యూస్ చేస్తున్నారు. WhatsApp వినియోగదారుల కొసం ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్స్ ని యాడ్ చెయ్యడం జరుగుతొంది మొత్తం అనుభవం మీద దాని మెసేజింగ్ ప్లాట్ఫారమ్ని మెరుగుపరచడానికి యొక్క కొత్త లక్షణాలను యాడ్ చేయడం జరిగింది.

వాట్స్అప్ ఒక సరళమైన మరియు ప్రాథమిక సందేశ వేదికగా ప్రారంభమైంది మరియు ఇప్పుడు అది గ్రూప్ వీడియో కాలింగ్,స్టిక్కర్లు మరియు మరిన్ని ఫీచర్లను అందిస్తుంది. వాట్సాప్ ద్వారా ఫొటోస్,వీడియోలను చాలా మందికి పంపవచ్చు మరియు రిసీవ్ చేసుకోవచ్చు.దీని ద్వారా స్మార్ట్ ఫోన్లొ మెమరీ స్టోరేజి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది.ఈ ప్రాబ్లం నుంచి బయట పాడటానికి వాట్స్ యాప్ కొత్త ఫీచర్స్ ని ప్రవేశపెట్టింది.

స్మార్ట్ ఫోన్ మెమరీ స్టోరేజిని సేవ్ చేయడానికి
వాట్స్ యాప్ చాట్లలో ఆటోమేటిక్ గా వీడియోస్ మరియు ఫొటోస్ డౌన్లోడ్ అవుతూఉంటాయి .అవసరం లేని మెసేజ్లు,ఫొటోస్,వీడియోస్ వంటి వాటిని నిరోదించడానికి మరియు స్మార్ట్ ఫోన్ మెమరీ స్టోరేజిని సేవ్ చేయడానికి కింది పద్ధతులు ఫాలో అవండి
1. వాట్స్ యాప్ ఓపెన్ చేయండి
2. రైట్ సైడ్ కార్నర్ పైన ఉన్న మూడు డాట్ ఆప్షన్ ని ట్యాప్ చేయండి .
3. సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి
4. చాట్స్ ని ట్యాప్ చేయండి
5. మీడియా విసిబిలిటీ కొసం చూడండి
6. దానిని ఆఫ్ చేయండి

మీరు WhA లో అన్ని చాట్లకు ఈ సెట్టింగ్ని ఉంచకూడదనుకుంటే కేవలం కొన్ని చాట్స్ కు మాత్రం కావాలి అంటే :
1. వాట్స్ యాప్ ఓపెన్ చేయండి
2. రైట్ సైడ్ కార్నర్ పైన ఉన్న మూడు డాట్ ఆప్షన్ ని ట్యాప్ చేయండి .
3. కాంటాక్ట్ వ్యూని ట్యాప్ చేయండి
4. మీడియా విసిబిలిటీని ట్యాప్ చేయండి
5. యాప్ లొ "Show newly downloaded media from this chat in your phone's gallary" ఉంటుంది
6. అందులో No ఆప్షన్ ని ఎంచుకోండి
స్మార్ట్ ఫోన్లో మీరు ఈ ఆప్షన్ ని ఎంచుకొంటే ఆటోమేటిక్ గా మీడియా డౌన్లోడ్ లు ఆగిపోతాయి.

గ్రూప్ చాట్స్ లొ ఎంచుకున్న చాట్ నుంచి ఆటోమేటిక్ గా మీడియా Disable చేయడానికి :
1. వాట్స్ యాప్ ఓపెన్ చేయండి
2. రైట్ సైడ్ కార్నర్ పైన ఉన్న మూడు డాట్ ఆప్షన్ ని ట్యాప్ చేయండి .
3. చాట్స్ ని ట్యాప్ చేయండి
4. Save to camera roll కొసం చూడండి
5. దానిని ఆఫ్ చేయండి

భవిష్యత్ లొ మీడియాను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాధాన్యతలను మ్యానేజ్ చేయడానికి :
1. వాట్స్ యాప్ ఓపెన్ చేయండి
2. రైట్ సైడ్ కార్నర్ పైన ఉన్న మూడు డాట్ ఆప్షన్ ని ట్యాప్ చేయండి .
3. డేటా మరియు స్టోరేజి లొకి వెళ్ళండి
4. ఆటోమేటిక్ డౌన్లోడ్ ఫొటోస్,వీడియోస్,డేటా,ఆడియో ఆప్షన్ ని ఎంచుకొండి
5. ప్రతి మీడియా మీద ట్యాప్ చేయండి,Never Wi-Fi, or Wi-Fi and Cellular ఆప్షన్ ని ఎంచుకొండి


Click it and Unblock the Notifications








