iPhoneలో ఆటో-కరెక్ట్ & ప్రిడిక్టివ్ టైపింగ్‌ని ఆన్ చేయడం ఎలా?

|

ఆపిల్ బ్రాండ్ యొక్క ఐఫోన్‌లు అద్భుతమైన అనేక ఫీచర్‌లతో లోడ్ చేయబడి ఉంటాయి. ఐఫోన్‌లతో వినియోగదారులు ఏదైనా ఒక ఫోటోని PDFగా సేవ్ చేయడం లేదా ఫోటోలలోని వచనాన్ని స్కాన్ చేయడం వంటి ప్రాథమిక విధులను మరింత సులభతరం చేసింది. అంతేకాకుండా వినియోగదారులు ఏదైనా మెసేజ్ ని టైప్ చేస్తున్నప్పుడు లేదా ఇమెయిల్‌ను పంపుతున్నప్పుడు మాట్లాడుతున్న దాని ఆధారంగా వినియోగదారులు టైప్ చేయబోతున్న వచనాన్ని అంచనా వేయడం ద్వారా వేగంగా టైప్ చేయడానికి వీలు కల్పించే ఫీచర్‌లతో కూడా ఐఫోన్‌లు వస్తాయి. ప్రిడిక్టివ్ టైప్ అని పిలువబడే ఈ ఫీచర్ వినియోగదారులను కేవలం కొన్ని ట్యాప్‌లతో మొత్తం వాక్యాలను వ్రాయడానికి మరియు పూర్తి చేయడానికి అనుమతిస్తుంది.

ఆటో-కరెక్ట్

ఆటో-కరెక్ట్ అని పిలువబడే మరొక ఫీచర్ కూడా ఐఫోన్‌లలో అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులు ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు పదాల యొక్క స్పెల్ చెక్ చేయడానికి కీబోర్డ్ నిఘంటువును ఉపయోగిస్తుంది. ఇది వినియోగదారులు తప్పుగా వ్రాసిన పదాలను స్వయంచాలకంగా సరిచేస్తుంది. ముఖ్యంగా మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే ఈ ఫీచర్ అధికంగా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఇంటర్నెట్‌లో ఉపయోగించే టెంగ్లీష్ (తెలుగు + ఇంగ్లీష్) లేదా యాస పదాలను ఉపయోగించాలనుకుంటే కనుక కొద్దిగా ఆలోచించాలి. కాబట్టి మీరు ఐఫోన్‌కి కొత్త అయితే మీరు ఐఫోన్‌లలో ఆటో-కరెక్ట్ మరియు ప్రిడిక్టివ్ టైపింగ్ ఫీచర్‌ను ఎలా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు అనేదాని కోసం కింద సూచించిన దశల వారీ గైడ్ ని అనుసరించండి.

సెట్టింగ్‌స్ ద్వారా ఐఫోన్‌లలో ఆటో-కరెక్ట్‌ని ఆన్ చేసే విధానం

సెట్టింగ్‌స్ ద్వారా ఐఫోన్‌లలో ఆటో-కరెక్ట్‌ని ఆన్ చేసే విధానం

స్టెప్ 1: ముందుగా మీ ఐఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు జనరల్ సెట్టింగ్‌ల కోసం క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని నొక్కండి.

స్టెప్ 3: తర్వాత కీబోర్డ్ ఎంపిక కోసం క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని ఎంచుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు ఆటో కరెక్షన్ బటన్‌పై టోగుల్ చేయండి.

 

iPhoneలో ప్రిడిక్టివ్ టైపింగ్‌ని ఆన్ చేసే విధానం

iPhoneలో ప్రిడిక్టివ్ టైపింగ్‌ని ఆన్ చేసే విధానం

స్టెప్ 1: మీ ఐఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: జనరల్ సెట్టింగ్‌ల కోసం క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని ఎంచుకోండి.

స్టెప్ 3: ఇప్పుడు కీబోర్డ్ ఎంపిక కోసం క్రిందికి స్క్రోల్ చేసి దాని మీద నొక్కండి.

స్టెప్ 4: తరువాత ప్రిడిక్టివ్ బటన్‌ మీద టోగుల్ చేయండి.

 

కీప్యాడ్ ద్వారా ఐఫోన్‌లో ఆటో-కరెక్ట్‌ని ఆన్ చేసే విధానం

కీప్యాడ్ ద్వారా ఐఫోన్‌లో ఆటో-కరెక్ట్‌ని ఆన్ చేసే విధానం

స్టెప్ 1: టెక్ట్ ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఎమోజి కీ లేదా స్విచ్ కీబోర్డ్ కీని టచ్ చేసి పట్టుకోండి.

స్టెప్ 2: ఇప్పుడు కీబోర్డ్ సెట్టింగ్‌లను ఎంచుకోండి.

స్టెప్ 3: తరువాత ప్రిడిక్టివ్ ఎంపికను ఆఫ్ చేయండి.

 

ఐఫోన్‌లో ప్రిడిక్టివ్ టైపింగ్‌ను ఆఫ్ చేసే విధానం

ఐఫోన్‌లో ప్రిడిక్టివ్ టైపింగ్‌ను ఆఫ్ చేసే విధానం

స్టెప్ 1: మీ ఆపిల్ ఐఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: జనరల్ సెట్టింగ్‌లను ఎంచుకోవడం కోసం క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని నొక్కండి.

స్టెప్ 3: కీబోర్డ్ ఎంపిక కోసం క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని నొక్కండి.

స్టెప్ 4: ఇప్పుడు ప్రిడిక్టివ్ బటన్‌ను ఆఫ్ చేయండి.

ప్రత్యామ్నాయంగా మీరు స్మైల్ ఎమోజి లేదా గ్లోబ్ చిహ్నాన్ని నొక్కి పట్టుకోవడం ద్వారా ప్రిడిక్టివ్ టైపింగ్ ఫీచర్‌ను కూడా ఆఫ్ చేయవచ్చు. కీబోర్డ్ సెట్టింగ్‌ల నుండి ప్రిడిక్టివ్ ఫీచర్‌ని ఆఫ్ చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Turn on and Off Auto-Correct and Predictive Typing on Apple iPhone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X